Beautiful Female Cricketers : ప్రపంచంలోనే అందమైన మహిళా క్రికెటర్లు వీరే..

Beautiful Female Cricketers
Beautiful Female Cricketers

Beautiful Female Cricketers :

* Ellyse Perry, Australia :

Eilyse Perry
Eilyse Perry

ఎల్లీస్ అలెగ్జాండ్రా పెర్రీ (జననం 3 నవంబర్ 1990) క్రికెట్ మరియు సాకర్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి . 16 సంవత్సరాల వయస్సులో జాతీయ క్రికెట్ జట్టు మరియు జాతీయ సాకర్ జట్టు రెండింటికీ అరంగేట్రం చేసిన ఆమె, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కురాలు.

* Holly Ferling, Australia :

Holly Ferling
Holly Ferling

హోలీ లీ ఫెర్లింగ్ (జననం 1995, డిసెంబరు 22) ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ క్రికెట్ క్రీడాకారిణి. 2013 లో ఆస్ట్రేలియా జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశీయ పోటీలలో ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ కోసం ఆడుతోంది. కుడిచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాటర్ గా రాణించింది.

Most Memorable Month 2024 : జూన్‌ నెల మరిచిపోలేమంతే..

* Smriti Mandhana, India :

Smriti Mandhana
Smriti Mandhana

స్మృతి శ్రీనివాస్ మందాన భారత మహిళా జాతీయ జట్టు తరఫున ఆడే ఇండియన్ క్రికెటర్. 2018 జూన్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్‌గా పేర్కొంది. 2018 డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్‌గా రాచెల్ హేహో-ఫ్లింట్ అవార్డును ప్రదానం చేసింది. అదే సమయంలో ఆమె ఐసిసి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది.

* Kainat Imtiaz, Pakistan :

Kainat Imtiaz
Kainat Imtiaz

కైనత్ ఇంతియాజ్ (జననం 21 జూన్ 1992) ఒక ఆల్-రౌండర్‌గా ఆడుతూ, కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ , కుడిచేతి మీడియం-వేగంగా బౌలింగ్ చేస్తూ, పాకిస్తాన్ తరపున ఆడుతుంది. ఆమె కరాచీ, సింధ్, ఒమర్ అసోసియేట్స్, సైఫ్ స్పోర్ట్స్ సాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మరియు జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ లకు కూడా దేశవాళీ క్రికెట్ ఆడింది. ఆమె అంపైర్ సలీమా ఇంతియాజ్ కుమార్తె.

*  Amelia Kerr, New Zealand :

Amelia Kerr
Amelia Kerr

అమేలియా షార్లెట్ కెర్ (జననం 2000, అక్టోబరు 13) న్యూజీలాండ్ క్రికెట్ క్రీడాకారిణి. ప్రస్తుతం వెల్లింగ్టన్, న్యూజీలాండ్ తరపున ఆడుతుంది. ఐర్లాండ్‌పై 232 నాటౌట్ స్కోర్ చేసి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కులైన క్రికెటర్ (పురుషుడు లేదా స్త్రీ)గా నిలిచింది.

* Renuka Singh, India :

Renuka Singh
Renuka Singh

రేణుకా సింగ్ ఠాకూర్ (జననం 1996 జనవరి 2) హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడుతునన్న భారతీయ క్రీడాకారిణి. సింగ్ 2019–20 సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. 2021 ఆగస్టులో, సింగ్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆమె తన మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్ (WT20I) అరంగేట్రం 2021 అక్టోబరు 7న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున ఆడింది.

* Jahanara Alam, Bangladesh :

Jahanara Alam
Jahanara Alam

జహనారా ఆలం (జననం 1 ఏప్రిల్ 1993) బంగ్లాదేశ్ మహిళా జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్. ఆమె కుడిచేతి మీడియం పేస్ బౌలర్ మరియు కుడిచేతి వాటం బ్యాటర్.

SKY is High: మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ సూర్య క్యాచ్..

*Charlie Dean, England :

Charlie Dean
Charlie Dean

షార్లెట్ ఎల్లెన్ డీన్ (జననం 22 డిసెంబర్ 2000) ప్రస్తుతం హాంప్‌షైర్ , సదరన్ వైపర్స్ మరియు లండన్ స్పిరిట్ తరపున ఆడుతున్న ఒక ఇంగ్లీష్ క్రికెటర్. ఆల్ రౌండర్, ఆమె కుడిచేతి వాటం బ్యాటర్ మరియు రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. ఆమె సెప్టెంబర్ 2021లో ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.

* Priya Punia, India :

Priya Punia
Priya Punia

ప్రియా పునియా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. 2018, డిసెంబరులోన్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం భారత జట్టులోకి ఎంపికైంది. 2019 ఫిబ్రవరి 6న న్యూజిలాండ్ మహిళల జట్టుపై భారతదేశం తరపున మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.

* Harleen Deol, India :

Harleen Deol
Harleen Deol

హర్లీన్ కౌర్ డియోల్, పంజాబ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. హిమాచల్ ప్రదేశ్ కొరకు అటాకింగ్ కుడిచేతి బ్యాటర్‌గా ఆడుతుంది. అప్పుడప్పుడు కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తుంది.

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post