‘బేబీ’ని నిజంగా Cult Classic అనొచ్చా..!?

Baby Movie :‘బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘కల్ట్ క్లాసిక్’ తీశామని తొడ కొట్టి మరీ చెప్పాడు ప్రొడ్యూసర్ SKN. అందరూ అనుకున్నట్టే ఓ చిన్న సినిమాగా మొదలై, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది ‘బేబీ’. 2023లో బేబీయే ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఈ జోనర్‌లో తెలుగులో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అయితే నిజంగా ‘బేబీ’ కల్ట్ క్లాసిక్ లిస్టులో చేరుతుందా..!?

మగాడు కృష్ణుడిలా ఉన్నా పర్లేదు, ఆడది మాత్రం సీతలాగే ఉండాలనే సమాజం మనది. అందుకే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లతో లేదా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసినా పర్లేదు కానీ హీరోయిన్ మాత్రం హీరోతో మాత్రమే ఉండాలి. ‘ఆరెంజ్’ సినిమాలో హీరోకి అరడజనుకి పైగా ప్రేమకథలున్నా అంగీకరించిన తెలుగు ఆడియెన్స్, అదే ప్లేస్‌లో ఓ అమ్మాయిని పెట్టి, కథ రాసుకొని ఉంటే.. ఓ రేంజ్‌లో ఆడుకునేవాళ్లు.. సమాజాన్ని చెడగొట్టే తిరుగుబోతు సినిమా తీశారని రచ్చరచ్చ చేసేవాళ్లు.
Baby Movie

‘మస్కా’ వంటి చాలా సినిమాల్లో ఓ హీరో, ఇద్దరు హీరోయిన్లతో లవ్ ఎఫైర్ నడిపి, అడ్డంగా బుక్కైతే తెగ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. అదే హీరో ప్లేస్‌లో హీరోయిన్ ఉంటే? రియాక్షన్ మరోలా ఉంటుంది. ఇదే ‘బేబీ’ సినిమా సక్సెస్‌కి కారణం. ‘బేబీ’ సినిమా, ఓ అమ్మాయి బరి తెగిస్తే హీరోయిన్‌ లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రమే అర్థం చేసుకున్నారు.

స్వాతి చెప్పినట్టుగా ‘month of madhu’ మూవీలో నిజంగా అంతుందా?

నిజంగా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేనా! తెలుగు రచయిత చలం రాసిన ‘మైదానం’ అనే నవలలో రాజేశ్వరి పాత్ర దాదాపు ఇలాంటిదే. ‘బేబీ’ సినిమా ఆ పాత్రకు మోడ్రన్ హంగులు దిద్ది డిజైన్ చేసింది. అయితే అప్పుడు ‘రాజేశ్వరి’ని పడక సుఖం కోసం మొగుడిని వదిలేసి, జీవితాన్ని నాశనం చేసుకున్న యువతి పాత్రలా చూసిన చాలామంది, ఇక్కడ ‘బేబీ’ని కూడా బరి తెగించిన అమ్మాయి కథలాగే చూస్తున్నారు.

‘బేబీ’ ఓ యువతి కథ. ప్రేమించినంత మాత్రాన తన లైఫ్‌లో ప్రతీ పనిని బాయ్‌ఫ్రెండ్ చెప్పినట్టు చేయాలా? మరి ఏ అబ్బాయి కూడా ప్రతీ పని చేసేముందు తన గర్ల్‌ఫ్రెండ్ పర్మిషన్ ఎందుకు తీసుకోడు? ఏ మగాడు కూడా తనకి లవర్ ఉందనే విషయం, మరో అమ్మాయితో చెప్పడు. అలాంటప్పుడు ఏ అమ్మాయి అయినా, తనకి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని మరో మగాడితో ఎందుకు చెప్పాలి?

మగాడి జీవితంలో తన లైఫ్, తన రూల్స్ అని ఉన్నప్పుడు.. ఆడదాని జీవితంలో ఎందుకు ఉండకూడదు? ఓవరాల్‌గా ఇది అందరూ అర్థం చేసుకున్నట్టే ఓ ముక్కోణపు ప్రేమకథ. జీవితంలో నచ్చిన దానికోసం తప్పులు చేసినా తప్పే కాదనుకునే పూర్తి క్లారిటీ ఉన్న యువతి కథ. వైష్ణవి పాత్రను హీరోగా మలిచి ఉంటే, ఇదో ఫన్నీ కామెడీ సినిమాగా, లేదా ట్రూ లవ్‌స్టోరీగా చూసేవాళ్లు ఇదే జనాలు. హీరోయిన్‌ మెయిన్ క్యారెక్టర్‌గా కథ ఉండడం వల్లే దీని జోనరే మారిపోయింది.

దేవరలో ఇదీ జరుగుతుంది..

ఇది ప్రేమంటే తెలియని ఓ పరిగతి లేని యువకుడి కథ. తల్లి ప్రేమను అర్థం చేసుకోలేని వాడికి, అమ్మాయి ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకునే మనసు ఎక్కడ ఉంటుంది? డబ్బు మదం నిండిన మరో యువకుడి కథ. గిఫ్ట్‌లు ఇచ్చి, అమ్మాయిని ఇంప్రెస్ చేసి, తన వల్ల కాలేజీలో ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోయే ధన మదం ఎక్కిన కుర్రాడి కథ.
Baby Movie

పక్కవాళ్ల సంతోషంగా ఉంటే చూసి తరించలేని బేబీలో ‘సీత’లు మనలో చాలామంది ఉన్నారు. కానీ అందరూ రామయణంలో సీతలాగే నటిస్తారు. ‘బేబీ’ సినిమా ఆటోడ్రైవర్ల కోసం అని మీమ్స్ వైరల్ చేసిన వాళ్లకి ఇందులో ఉన్న డెప్త్ అర్థం కాదు.

వాళ్లందరికీ ఆ ఆటోడ్రైవర్ జీవితం అలా అయిపోవడానికి హీరోయినే కారణం కూడా. కానీ అప్పటికే చదువు బోల్తా కొట్టేసి, అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు అప్పులు చేసి.. తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడనే లాజిక్ చాలామందికి అర్థం కాదు. మొత్తానికి ‘బేబీ’ని కల్ట్ క్లాసిక్‌గా ఒప్పుకోవడానికి కూడా చాలామందికి మనసొప్పదు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ప్రతీ పాత్రకి ఓ మీనింగ్ ఉంది. ఓ నిజమైన క్యారెక్టర్ ఉంది. అది అర్థం చేసుకున్నవారికి ‘బేబీ’ కచ్ఛితంగా ఓ మంచి సినిమానే.

బీడీ, బీడీ, బీడీ.. బీడీ తప్ప ‘గుంటూరు కారం’లో ఇంకో స్టిల్ లేదా గురూజీ..

మగాడు కృష్ణుడిలా ఉన్నా పర్లేదు, ఆడది మాత్రం సీతలాగే ఉండాలనే సమాజం మనది. అందుకే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లతో లేదా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసినా పర్లేదు కానీ హీరోయిన్ మాత్రం…

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post