Anudeep KV : నెక్ట్స్ మూవీ ఎవరితో..

Anudeep KV
Anudeep KV

Anudeep KV : ‘జాతిరత్నాలు’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు అనుదీప్.. ఈ సినిమా వల్ల ఎంత పబ్లిసిటీ వచ్చిందో, సుమ ‘క్యాష్’ షో కారణంగా అంతకంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది అనుదీప్‌కి. ‘జాతిరత్నాలు’ తర్వాత కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ మూవీ చేశాడు అనుదీప్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో రెండేళ్లుగా మరో సినిమా మొదలెట్టలేదు అనుదీప్..

అనుదీప్, రవితేజతో సినిమా తీయబోతున్నాడని టాక్ నడిచింది.. రవితేజ హిట్టు కొట్టి చాలా రోజులైంది. రవితేజ కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి వయోలెన్స్, బూతు జోకులు, వెటకారం లేకుండా కామెడీ పండించడం అనుదీప్ స్పెషాలిటీ. అందుకే రవితేజ, అనుదీప్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని మాస్ రాజా ఫ్యాన్స్ తెగ ఎదురుచూశారు.

టాలీవుడ్ ఓ బిగ్ బాస్ హౌస్ అయితే వెంకటేష్ పక్కా సేఫ్ గేమ్ ప్లేయర్..

అయితే అనుదీప్ తర్వాతి సినిమా రవితేజతో కాదు, నేచురల్ స్టార్ నానితో అంటూ వార్తలు వచ్చాయి. నాని ప్రస్తుతం వరుసగా మాస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కామెడీ మూవీ చేసి చాలా కాలమే అయ్యింది. అంతలోనే అనుదీప్, విశ్వక్ సేన్‌తో సినిమా చేయబోతున్నాడని ఇంకో వార్త వచ్చింది..

విశ్వక్ సేన్ ఓ సినిమా సైన్ చేయాలంటే చాలా చూస్తారు. సింపుల్ కామెడీతో సాగే అనుదీప్ స్టోరీ రైటింగ్, మేకింగ్‌కి విశ్వక్ సేన్ చాలా దూరం.. ఈ వెరైటీ కాంబో ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే అనుదీప్ తర్వాతి సినిమా, నానితోనే, రవితేజతోనే, లేక విశ్వక్ సేన్‌తోనో కాదు.. విక్టరీ వెంకటేశ్‌తో అంటూ తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్, వెంకీలతో అనుదీప్ ఓ క్రేజీ కాంబో సెట్ చేశాడని ఈ వార్త సమాచారం.. ఇదైనా నిజం అవుతుందా? లేక కొన్ని రోజులకు మళ్లీ ఓ కొత్త హీరో తెరపైకి వస్తాడా? అనుదీప్ తర్వాతి సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎవరితో మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికి దొరకుతాయో చూద్దాం..

 

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post