Allu Arjun : అల్లు అర్జున్ టైమ్ ఏమీ బాగున్నట్టు లేదు. లేక లేక రాజకీయాల వైపు చూసి తన స్నేహితుడి కోసం మద్ధతు ప్రకటిస్తే, అతను కాస్తా చిత్తుగా ఓడిపోయాడు. మామయ్యకి కాకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకు మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు, మెగా ఫ్యాన్స్‌కి శత్రువుగా మారాడు. పాన్ ఇండియా లెవెల్లో రూ.1000 కోట్లు కొడుతుందని అనుకున్న ‘పుష్ప 2’ మూవీ, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదు.
ఈ సినిమాలో చాలా పార్ట్ మళ్లీ రీషూట్ చేయాలని డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డిసైడ్ కావడంతో ‘పుష్ప 2’ మూవీ, ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌కి వెళ్లినట్టు టాక్.. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు అట్లీతో సినిమా తీయాలని అనుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తాడని కూడా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్- అట్లీ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది.
Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..
‘జవాన్’ మూవీ సూపర్ హిట్ తర్వాత ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారాడు అట్లీ (Atlee).. అల్లు అర్జున్‌తో సినిమా కోసం రూ.80 కోట్లు డిమాండ్ చేశాడట అట్లీ. రాజమౌళి తప్ప తెలుగులో ఏ డైరెక్టర్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. దీంతో గీతా ఆర్ట్స్, అట్లీకి రూ.50 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పిందట. బన్నీ పని చేసిన డైరెక్టర్లలో రూ.50 కోట్లు తీసుకున్న డైరెక్టర్ మీరేనంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసిందట. కానీ అట్లీ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గలేదని, దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్..
డైరెక్టర్‌కి రూ.80 కోట్లు ఇస్తే, హీరోగారు రూ.120 కోట్లు డిమాండ్ చేస్తారు. ఈ ఇద్దరి రెమ్యూనరేషన్‌కే రూ.200 కోట్లు దాటితే మిగిలిన వాళ్ల రెమ్యూనరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చు కలిసి రూ.350 కోట్ల దాకా అవుతుంది. సినిమా రూ.500 షేర్ వసూలు చేస్తే కానీ హిట్టు కిందకి రాదు. అల్లు అర్జున్- అట్లీ మార్కెట్‌కి ఇది చాలా ఎక్కువ. అందుకే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది..