Actress Rachna Banerjee : రంభతో పోటీపడిన హీరోయిన్, ఇప్పుడు ఎన్నికల్లోకి..

Actress Rachna Banerjee : తెలుగులో తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువగా వేరే భాషా హీరోయిన్లకే ఛాన్సులు వస్తాయి. అలా బెంగాలీ టాప్ హీరోయిన్ రచనా బెనర్జీ, తెలుగులో టాప్ హీరోల సినిమాల్లో నటించింది. చిరంజీవితో కలిసి ‘బావగారూ బాగున్నారా’ అని పలకరించిన రచనా, బాలయ్యబాబుతో ‘సుల్తాన్‌’లో చిందులేసింది. మోహన్ బాబుతో ‘రాయుడు’ సినిమా చేసిన రచన, శ్రీకాంతో ‘కన్యాదానం’, ‘పిల్లనచ్చింది’, జగపతిబాబుతో ‘మావిడాకులు’ వంటి సినిమాలు చేసింది.

Hero Venkatesh: రాజకీయాల్లోకి విక్టరీ వెంకటేశ్.. వియ్యంకుడిని గెలిపించుకోవడానికి..

సుమన్, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, ఉపేంద్ర వంటి హీరోలతో సినిమాలు చేసిన రచనా గుర్తుకువచ్చిందా? ఇప్పుడు ఆ బ్యూటీ ఎక్కడుంతో తెలుసా.. బెంగాలీలో 50 సినిమాలు చేసిన రచనా, ఒడియా భాషలోనూ 25 సినిమాల్లో నటించింది. అక్కడితో ఆగిపోకుండా సౌత్‌లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది.

తెలుగులో సినిమాలు తగ్గించేసినా, బెంగాలీలో రియాల్టీ షోస్, సీరియల్స్ చేస్తూ తెగ బిజీగా ఉంది. తాజాగా తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరుపున హుగ్లీ నియోజిక వర్గం నుంచి పోటీ చేస్తోంది రచనా.. ‘బావగారూ బాగున్నారా?’ సినిమాలో రంభకి అక్కగా, ‘సుల్తాన్’ సినిమాలో రోజాతో కలిసి ఇంకో హీరోయిన్‌గా నటించింది రచనా..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post