Actress Anjali : తెలుగు అమ్మాయి 50 సినిమాల్లో చేయడమంటే మామూలు ఫీట్ కాదు. అప్పుడెప్పుడో రమ్యకృష్ణ, రంభ తర్వాత 50 సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్‌గా నిలిచింది అంజలి. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తర్వాత ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించింది అంజలి. ఈ రెండు సినిమాల్లో తన క్యారెక్టర్, లీడ్ రోల్‌లా ఉంటుందని కూడా చెప్పింది. అయితే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చూసిన అంజలి ఫ్యాన్స్, షాక్ అయ్యారు. ‘అసలు అంజలి , ఎలా ఈ సినిమా ఒప్పుకుందో’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో అంజలి, రత్నమాల అనే క్యారెక్టర్ చేసింది. నిజానికి రత్నమాల క్యారెక్టర్ సినిమాకి మెయిన్ కూడా. ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే అంతే అందంగా రత్నమాలను ప్రెజెంట్ చేయడంలో మాత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ యూనిట్ ఫెయిల్ అయ్యింది. మొత్తంగా అంజలి క్యారెక్టర్, గెస్ట్ రోల్‌కి ఎక్కువ, సైడ్ క్యారెక్టర్‌కి తక్కువలా మారింది..
అదీకాకుండా నేహా శెట్టి లాంటి గ్లామరస్ హీరోయిన్ ఉన్నప్పుడు, ఆమె ముందు ఎవ్వరైనా నిలబడడం కష్టమే. ‘టిల్లు స్క్వైర్’ సినిమాలో మొదటి నుంచి అందాలు ఆరబోస్తూ, సూపర్ హాట్‌గా కనిపించేందుకు తెగ కష్టపడింది అనుపమ పరమేశ్వరన్. క్లైమాక్స్‌లో నేహా శెట్టి అలా ఓ 2 నిమిషాలు చీరలో కనిపించి, కుర్రాళ్లను తనవైపు తిప్పేసుకుంది. అలాంటి హీరోయిన్ ఉండడం వల్ల కూడా అంజలి పెద్దగా ఆనలేదని చెప్పొచ్చు.
అయితే అంజలి, ఈ రోల్ ఎలా ఒప్పుకుంది? ఆమెకు చెప్పింది, తీసింది ఒక్కటేనా? లేక సినిమా నిడివి తగ్గించడానికి అంజలి సీన్స్‌ని కట్ చేశారా? మరి ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నానని చెప్పిన అంజలి, థియేటర్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూశాక ఎలా ఫీల్ అయ్యింది? ఈ ప్రశ్నలకు త్వరలోనే అంజలి సమాధానం చెబుతుందేమో..