AaduJeevitham : కేరళ రైటర్, దర్శకుడు, హీరో పృథ్వీరాజ్‌కి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించిన పృథ్వీరాజ్, మలయాళంలో అదిరిపోయే సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ అయిన ‘గాడ్ ఫాదర్’ మూవీని మలయాళంలో ‘లూసిఫర్’ పేరుతో తెరక్కించాడు పృథ్వీరాజ్. ఈ సినిమాలో తెలుగులో డబ్ అయ్యి, హిట్టు అయ్యాక, మన మెగాస్టార్ మళ్లీ రీమేక్ చేశాడు..
SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..
ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘ఆడుజీవితం’ మార్చి 28న విడుదల అవుతోంది. ఇది ఓ నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిందనే విషయం చాలామందికి తెలీదు. బతుకు తెరువు కోసం ఓ మలయాళ కుర్రాడు, సౌదీ అరేబియాకి వెళ్లాడు. అయితే అతన్ని ఏజెంట్, ఓ అరబ్ సాయెబ్కి అమ్మేసినట్టు తెలుసుకుంటాడు. నర మానవుడు కూడా లేని ఎడారిలో 700 మేకలను కాసే ఉద్యోగం..
చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొడుతూ, తిడుతూ అవమానిస్తూ రెండేళ్లు నరకాన్ని అనుభవిస్తాడు. రెండేళ్లు ఎవ్వరితో మాట్లాడాలో తెలియక మేకలతో మాట్లాడుతూ గడుపుతాడు. ఆ నరకం నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అనేదే ‘ఆడు జీవితం’ కథ. మలయాళంలో దీనికి అర్థం ‘మేక జీవితం’. మేకలతో కలిసి బతికిన వ్యక్తి కావడంతో ‘ది గోట్ లైఫ్’ అనే టైటిల్‌తో 2008లో పుస్తకం వచ్చింది. 2024లో సినిమాగా రాబోతోంది.
Jr NTR Bollywood Movies : బాలీవుడ్లో పాగా వేస్తున్న ఎన్టీఆర్.. వార్ 2 తర్వాత హీరోగా మరో సినిమా..