Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై లోక్‌సభ బహిష్కరణ వేటు విధించింది. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హిరానందిని నుంచి మహువా మోయిత్రా, అక్రమంగా బహుమతులు స్వీకరించినట్టు తేలడంతో ఆమెపై బహిష్కరణ విధించింది శాసన సభ. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా నిర్ణయం తీసుకున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
అలాగే లోక్‌సభ సభ్యుల పోర్టల్‌కి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని అనధికారిక వ్యక్తులతో షేర్ చేసుకున్నట్టు విచారణలో తేలింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించిన ఎంపీ మహువా మోయిత్రాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీ సిఫారసు చేసింది.
నన్ను మోదీజీ లేదా గౌరవనీయమైన మోదీ అని సంబోధించకండి: ప్రధాని
అదానీ గ్రూపుకి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రశ్నలు వేసింది మహువా మోయిత్రా. అయితే ఈ ప్రశ్నలు వేసేందుకు వ్యాపారవేత్త దర్శన్ హిరానందిని నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణలో తేలింది. అయితే మహువా మోయిత్రా మాత్రం తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదంటూ వాదించింది. ఈ చర్య బీజేపీ అంతానికి నాంది అంటూ వ్యాఖ్యలు చేసింది.