ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవలో తలదూరుస్తున్న అమెరికా.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

Israel – Palestine Conflict : ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా, వెంటనే తలదూర్చడం అమెరికాకి అలవాటు. ప్రపంచ దేశాల పెద్దన్న హోదాని తనకి తాను ఇచ్చుకున్న అమెరికా, తాజాగా ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవపై స్పందించింది.

లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..

గాజాలో ఇజ్రాయిల్ దళాలు విధ్వంసం సృష్టిస్తూ, హమాస్ సైన్యంతో సాధారణ ప్రజలపై కూడా దాడులు చేస్తున్నాయి. హమాస్ సైన్యం పూర్తిగా అంతం అయ్యేదాకా ఈ యుద్ధం ఆగదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశాడు కూడా.. ఇన్నాళ్లు ఈ యుద్ధంపై సైలెంట్‌గా ఉన్న అమెరికా, పరోక్షంగా పాలస్తీనాకి మద్ధతు ప్రకటించింది.
Israel - Palestine Conflict

గాజాపై జరుగుతున్న దాడులను, ఆక్రమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేశాడు. అమెరికా జోక్యంతో ఇజ్రాయిల్- పాలస్తీనా వివాదం మరింత పెరిగే ప్రమాదం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

యుద్ధానికి ముందు గాజాలో ఉన్న పరిస్థితులను తిరిగి తీసుకురావడం వచ్చే పదేళ్లలో జరగని పని. ఇజ్రాయిల్ దృష్టిలో గాజా ఇప్పుడు హమాస్ సైన్యంతో నిండిన ఓ అతి పెద్ద ఉగ్ర స్థావరంగా మారింది. దీన్ని తిరిగి హస్తగతం చేసుకునేందుకు ఇజ్రాయిల్ దళాలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. అమెరికా జోక్యంతో ఈ పరిస్థితి తగ్గుతుందా? లేక మరింత పెరుగుతుందా? లేక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అనే భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post