Vaamu annam : కేవలం నాలుక ఇచ్చే రుచి కోసమే కాదు, ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి. అందుకే పొట్టను క్లీన్ చేసే ఆహారాలను అప్పుడప్పుడు తినాలి. అలాంటి ఆహారమే వామన్నం. వాములో ఉండే ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కావు. వారాకోసారి వాము అన్నాన్ని పిల్లలు, పెద్దలు అందరూ తింటే అనారోగ్యానికి ఎంతో మంచిది. తక్కువ టైంలో నోటికి రుచిగా కావాలి అనుకుంటే వామన్నం చేసుకోవచ్చు. రాత్రి అన్నం లేదా వేడి వేడి అన్నంతోనైనా ఈ వామన్నం చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు..
* వాము ఒక టీ స్పూన్
* పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్
* మినప్పప్పు ఒక టీ స్పూన్
* జీలకర్ర 1/2 స్పూన్
* ఆవాలు 1/2 స్పూన్
* ఎండు మిరపకాయలు నాలుగు
* పచ్చిమిర్చి రుచికి సరిపడ
* కరివేపాకు రెండు రెమ్మలు
* పసుపు చిటికెడు (అప్షనల్)
* ఇంగువ చిటికెడు
* ఉప్పు రుచికి సరిపడినంత
తయారీ విధానం..
ముందుగా పొడిపొడి ఉండేలా అన్నం పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు ఆవాలు, జీలకర్ర వేసి సగం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత.. వాము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో చిటికెడు ఇంగువ, పసుపు కూడా వేసి, అన్ని బాగా ఫ్రై అయ్యాక.. ముందుగా పక్కన పెట్టుకున్న అన్నం కూడా అందులో వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో సింపుల్ గా రుచిగా ఉండే వామన్నం 5 నిమిషాల్లో రెడీ అవుతుంది.
వామన్నం వలన లాభాలు..
* వామన్నం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చాలా బాధలు తొలగిపోతాయి.
* మలబద్ధకం సమస్యను కూడా వాము తీర్చేస్తుంది.
* పాలిచ్చే తల్లులు వాము అన్నం తినడం వల్ల పాల ఉత్పత్తి బావుంటుంది.
* పిల్లలకు సరిగా అరగకపోవడం వలన కడుపునొప్పి వస్తుంటుంది. అలాంటి నొప్పులు రాకుండా ఉండాలంటే వారానికోసారైనా వాము అన్నం పెట్టాల్సిందే.
Handloom Sarees : హ్యాండ్లూమ్ సారీస్ గురించి తెలుసా..!?