DEVARA Movie Review in Telugu:ఫ్యాన్స్‌కి పూనకాలే.. కొరటాల శివ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే కానీ…

Devara Telugu Movie Review : దేవర మూవీ రివ్యూ: ఫ్యాన్స్‌కి పూనకాలే.. కొరటాల శివ కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే కానీ…

‘ఆచార్య’ వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో ‘దేవర’ మూవీ చేశాడు ఎన్టీఆర్. ‘టెంపర్’ మూవీ నుంచి వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ వచ్చిన తారక రాముడు, ‘RRR’ మూవీ కోసం మూడేళ్లు, ‘దేవర’ కోసం మరో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఆరేళ్లకు సోలో సినిమా రిలీజ్ చేశాడు ఎన్టీఆర్. ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌తో కృంగిపోయిన డైరెక్టర్ కొరటాల శివకి ఈ మూవీ సక్సెస్ చాలా అవసరం. రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత మూవీ ఫట్టే సెంటిమెంట్‌ని ఎన్.టీ.ఆర్ బ్రేక్ చేశాడా..

మనిషి బతకడానికి ఉండాల్సినంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదు అనే లైన్ మీద ‘దేవర’ కథ రాసుకున్నాడు కొరటాల శివ.. ఫస్టాఫ్‌లో మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌, ఫైట్స్‌తో నింపేసిన కొరటాల శివ, ప్రేక్షకులను ‘దేవర’ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. సముద్రపు దొంగల ముఠాలో గొడవలు, ఆ గ్యాంగ్‌ని నడిపించే నాయకుడినే చంపేయాలని అనుకోవడం పాయింట్‌తో కథ రాసుకుని, దానికి న్యాయం చేయగలిగాడు…

ఫస్టాఫ్‌లో వచ్చే సీన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్.. అదిరిపోతాయి.. సెకండాఫ్‌ మాత్రం చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సింగిల్ పార్ట్‌లో అయిపోకొట్టాల్సిన సినిమాని, సెకండ్ పార్ట్ కోసం లాగడంతో సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి మళ్లీ సినిమా టైట్‌గా సాగినా… క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చాలా మంది ఊహించేస్తారు..

ఎన్టీDevara (NTR) మరోసారి యాక్టింగ్ ఇరగదీసేశాడు. ఈ సినిమాని సాధ్యమైనంతవరకూ తన యాక్టింగ్‌తోనే లాక్కొచ్చాడు. సైఫ్ ఆలీ ఖాన్ కూడా బాగా నటించాడు. జాన్వీ కపూర్ గ్లామర్‌తో స్క్రీన్‌ని హీటెక్కించింది. ముఖ్యంగా అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్‌ స్కోరుతో పాటు రత్నవేలు సినిమాటోగ్రఫీ ‘దేవర’కి ప్రధాన హైలైట్. ఈ ఇద్దరూ సినిమాని ఓ లెవెల్‌కి తీసుకెళ్లారు..

‘ఆచార్య’ అట్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. అయితే సింగిల్ పార్ట్‌లో తీయాల్సిన సినిమాని రెండు పార్టులుగా తీయాలనే నిర్ణయం కారణంగా సెకండాఫ్ సాగి, కాస్త బోర్ కొట్టిస్తుంది. అయితే ఎన్.టీ.ఆర్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహాయిస్తే మిగిలిన వారికి కూడా ‘దేవర’ నచ్చుతాడు.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే…

సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ‘దేవర’తో కొరటాల శివ ‘సగం’ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. పూర్తి కమ్‌బ్యాక్ కోసం దేవర పార్ట్ 2 (DEVARA 2) వచ్చేదాకా ఆగాల్సిందే..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post