Pawan Kalyan Birthday Special : సీఎం పదవి కంటే.. పవర్ స్టార్ ఇమేజ్ గొప్పదా..!?

Pawan Kalyan Birthday Special
Pawan Kalyan Birthday Special

Pawan Kalyan Birthday Special : తొలి తరంలో ఎన్టీ రామారావు, స్టార్ హీరోగా ఎదగడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. చిరంజీవి, ‘సుప్రీం హీరో’ నుంచి ‘మెగాస్టార్’గా మారడానికి 15 ఏళ్లకు పైగా పట్టింది. అయితే కేవలం మూడంటే మూడు సంవత్సరాల్లోనే యూత్‌లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుని, ‘పవర్ స్టార్’ (Power Star) గా ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగ్రేటం చేశాడు పవన్ కళ్యాణ్. మొదటి సినిమాలోనే తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ చూపించి, యూత్‌ని మెస్మరైజ్ చేశాడు. అయితే మొదటి సినిమాలో పవన్ కళ్యాణ్, నటనతో మెప్పించలేకపోయాడు.

అందుకే అదే ఈవీవీ, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో ‘నువ్వేంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోలాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్?’ అని వెంకీతో డైలాగ్ చెప్పించాడు. అప్పుడంటే ఈ డైలాగ్‌ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి డైలాగ్ పెడితే, రాష్ట్రాలు తగలబడిపోతాయ్..

Pawan Kalyan : నా రెమ్యూనరేషన్ తగ్గించండి, వాళ్లకు సరైన భోజనం పెట్టండి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఇంతటి క్రేజ్ రావడానికి కారణమేంటి? ‘గోకులంలో సీత’లో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ ధనవంతుడైన చిలిపి కుర్రాడి పాత్రలో కనిపించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ‘సుస్వాగతం’ సినిమాలో ఒకే అమ్మాయిని మూడేళ్ల పాటు సీన్సియర్‌గా ప్రేమించే అమాయక యువకుడిలా కనిపించాడు. అయితే ‘తొలిప్రేమ’ నుంచే పవన్ ‘పవర్’ మొదలైంది…

‘తొలిప్రేమ’లో తన ప్రేమను అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియని కుర్రాడిగా కనిపించిన పవన్‌లో తమని తాము చూసుకున్నారు కుర్రాళ్లు. ఆ తర్వాత ‘తమ్ముడు’ సినిమాలో అన్న కోసం బాక్సింగ్ నేర్చుకునే తమ్ముడిలా పవన్‌ని చూసి, చాలామంది బాక్సింగ్ నేర్చుకోవాలని ఉత్సాహం చూపించారు.

‘బద్రీ’ సినిమాలో ‘నువ్వు నందా అయితే నేను బద్రీ, బద్రీనాథ్…’ అని పవన్ చెప్పిన డైలాగ్, ఆ యాటిట్యూడ్‌… అతన్ని యూత్‌కి మరింత దగ్గర చేసింది. ‘ఖుషి’ సినిమాతో పవన్ స్టార్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. పవన్ కళ్యాణ్‌కి క్రేజ్ రావడానికి వరుస హిట్లు మాత్రమే కారణం కాదు.

ఎందుకంటే చాలా మంది హీరోలు వరుస హిట్లు కొట్టి క్రేజ్ తెచ్చుకున్నాక, ఒక్క ఫ్లాప్‌తో దాన్ని పోగొట్టుకున్నారు. అయితే మిగిలిన హీరోలకు, పవన్ కళ్యాణ్‌కి తేడా ఇక్కడే ఉంది. ‘ఖుషి’ తర్వాత ‘జానీ’, ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘బంగారం’, ‘అన్నవరం’ ఇలా 7 ఏళ్లు ఒక్క హిట్టు లేకుండా గడిపేశాడు పవన్ కళ్యాణ్..

Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..

పవన్ ప్లేస్‌లో మరో హీరో ఉండి ఉంటే, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సగానికి తగ్గిపోయేది. అయితే ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా పవన్ కళ్యాణ్ ఇమేజ్, క్రేజ్ తగ్గలేదు సరికదా మరింత పెరుగుతూ పోయింది. ‘జల్సా’తో మళ్లీ హిట్టు కొట్టిన పవన్ కళ్యాణ్, ‘పులి’, ‘తీన్‌మార్’, ‘పంజా’ రూపంలో మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చాడు.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ కాపాడుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ బర్త్ డే సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ చేశారు. ఇందులో ‘OG’ టీజర్ కూడా వేశారు. అయితే టీజర్‌లో ‘డిప్యూటీ సీఎం’ అని ప్రత్యేకంగా టైటిల్ జోడించారు.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది గొప్పదా? అభిమానం, ఫ్యానిజం పక్కనబెట్టి వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్, ఈ డిప్యూటీ, సీఎం పదవులకు గ్యారెంటీ లేదు…

ఈసారి పోటీచేసిన ప్రతీ చోటా జనసేన పార్టీ గెలిచింది. అయితే ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. వచ్చేసారి బంపర్ మెజారిటీతో గెలిస్తే, మరో ఐదేళ్లు పదవిలో ఉండొచ్చు. ఆ తర్వాత ఆ మళ్లీ మళ్లీ గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు. అయితే హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా జనాల గుండెల్లో సంపాదించుకున్న ‘పవర్ స్టార్’ ఇమేజ్ మాత్రం చెరపలేనిది. కాబట్టి, ‘సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ ఆ పదవుల కంటే మా పవర్ స్టార్’ ఇమేజ్ చాలా గొప్పది అంటున్నారు కొందరు పవన్ వీరాభిమానులు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post