Vinesh Phogat : అసలేం జరిగింది.. ఆమె మోసం చేసిందా..?

Vinesh Phogat : పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరిన మొదటి భారత రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది వినేశ్ ఫోగట్. 2016 రియో ఒలింపిక్స్‌లో గాయంతో వెనుదిరిగిన వినేశ్ ఫోగట్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ నుంచే నిష్కమించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణించి ఫైనల్ చేరింది. ఇక వినేశ్ ఫోగట్ గోల్డ్ మెడల్ గెలిచి, భారత పతకాన్ని సగర్వంగా ఎగరవేస్తుందని అనుకున్నారంతా. అయితే ఫైనల్‌కి చేరిన 12 గంటల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది..

50 కేజీల విభాగంలో బరిలో దిగిన వినేశ్ ఫోగట్, ఫైనల్‌కి ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఒలింపిక్ మెడల్ ఆశ నెరవేరకుండానే వినేశ్ ఫోగట్, రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. ఆ 12 గంటల్లో ఏం జరిగింది.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOC) చీఫ్ పీటీ ఉష చెప్పిన మాటలను బట్టి, వినేశ్ ఫోగట్ విషయంలో సపోర్టింగ్ స్టాఫ్ చేసిన తప్పు, భారత్‌కి పతకాన్ని దూరం చేసింది…

మిగిలిన క్రీడల్లాగా రెజ్లింగ్‌కి మ్యాచ్ మ్యాచ్‌కి పెద్దగా సమయం దొరకదు. మొదటి మ్యాచ్ ఆడిన రెండు గంట్లోలనే క్వార్టర్స్, ఆ తర్వాత మరో మూడు గంటల్లోనే సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆ తర్వాతి రోజు షెడ్యూల్ అయ్యింది.

50 కిలోల కేటగిరి కావడంతో పోటీలు జరిగే రెండు రోజులు ఉదయం బరువు చెక్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు నుంచి రెజ్లర్లకు నీళ్లు, ఆహారం కూడా ఇవ్వరు. ఎందుకంటే రెజర్లు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్ట్‌లదే.

మంగళవారం సరైన బరువే ఉన్న వినేశ్ ఫొగట్, మ్యాచ్‌కి ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది. బౌట్ సమయంలో నీళ్లు తాగింది. మొత్తంగా సెమీస్ గెలిచిన రోజు 1.5 కేజీల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంది. ఈ కారణంగానే మ్యాచ్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువగా కనిపించింది. అయితే న్యూట్రిషనిస్ట్ మాత్రం ఉదయం కల్లా తగ్గిస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

ఉదయం 7.15 నుంచి 7.30 మధ్య వెయిట్-ఇన్ చేయాల్సి ఉండగా రాత్రంతా కఠినమైన ఎక్సర్‌సైజ్‌లు చేశారు. నీళ్లు తీసుకోకుండా సోనా బాత్ వంటివి చేసింది. చివరి క్షణంలో వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ చేశారు. జెర్సీ కొలతలు కూడా తగ్గించారు. కానీ 100 గ్రాములు ఎక్కువగానే ఉంది. మరో గంట సమయం అడిగినా ఐవోసీ ఇవ్వలేదు. దీంతో వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అవక తప్పలేదు.

బరువు కొలిచే సమయానికి న్యూట్రిషన్ కంగారుపడి తీవ్రమైన ఎక్సర్‌సైజులు చేయడంతో వినేశ్ ఫోగట్ డీహైడ్రేషన్‌కి గురై, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. న్యూట్రిషన్ చేసిన తప్పు కారణంగా ఓ రెజ్లర్ కెరీర్‌కి సరైన గుర్తింపు దక్కలేదు. భారత్ ఖాతాలో కనీసం సిల్వర్ మెడల్ ఛాన్స్ మిస్ అయ్యింది..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post