Ram Charan – Shankar : చెర్రీ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న శంకర్..

Ram Charan - Shankar
Ram Charan - Shankar

Ram Charan – Shankar : శంకర్ ఓ సినిమా తీస్తున్నాడంటే అంచనాలు మామూలుగా ఉండవు. ‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జెంటిల్మెన్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘బాయ్స్’.. ఇలా ఓ సామాజిక అంశాన్ని తీసుకుని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, సూపర్ హిట్ సినిమాలు తీయడం శంకర్ స్పెషాలిటీ. ‘శివాజీ’, ‘రోబో’ ముందు వరకూ శంకర్ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టు కొట్టినవే. అయితే ఆ తర్వాతే సీన్ మారింది..

Bharateeyudu 2 Movie Review : నో ఎమోషన్స్, ఓన్లీ కరెప్షన్..

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’, ‘2.0’ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయినా ఫ్యాన్స్‌కి నచ్చాయి. అయితే విజయ్‌తో తీసిన ‘స్నేహితుడు’ మాత్రం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రాజ్‌కుమార్ హిరాణి తీసిన ‘త్రీ ఇడియట్స్’ మూవీని మక్కీకి మక్కీ దింపేశాడు శంకర్. ప్రతీ సీన్, ప్రతీ కాస్ట్యూమ్, హిందీలో ఉన్నట్టే ఉంటాయి. ఇలా సీన్ టు సీన్ కాపీ చేయడానికి శంకర్ తీయాల్సిన అవసరం లేదు.. సినిమా తీసిన అనుభవం కూడా లేని ఏ డైరెక్టర్‌కి రీమేక్ చేయగలడు.

తాజాగా ‘భారతీయుడు 2’ సినిమా మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. శంకర్ మేకింగ్, టేకింగ్ అంతా అవుట్ డేటెడ్‌లా అనిపించాయి. ఈ సినిమా కోసం నాలుగేళ్లు కేటాయించాడు శంకర్. లాక్‌డౌన్‌లో ‘భారతీయుడు 2’ సినిమాకి సంబంధించిన క్రియేటివ్ వర్క్ అంతా ఫినిష్ చేశా అన్నాడు. అయితే సినిమా చూస్తే అలా అనిపించలేదు.

Ram Charan Game Changer : ట్రెండ్ ఫాలో అవుతున్న ‘గేమ్ ఛేంజర్’..

‘భారతీయుడు 2’ ఎఫెక్ట్ శంకర్ తర్వాతి సినిమా ‘గేమ్ ఛేంజర్’ పైన పడుతుందేమోనని భయపడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్. చెర్రీ, ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం మూడేళ్లు కేటాయించాడు. ఓ పొలిటికల్ డ్రామా సినిమా కోసం ఇన్నేళ్లు డేట్స్ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు ‘భారతీయుడు 2’ ఎఫెక్ట్, ఆ సినిమాపై పడనుంది. అదీకాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు.. వచ్చినా ఆడుతుందో లేదో అని భయపడుతున్నారు చెర్రీ ఫ్యాన్స్..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post