Nandyal Tragic incident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. నంద్యాలలో మూచుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న ఓ బాలికపై, అదే ఊరికి చెందిన 6-7వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు హత్యాచారం చేశారు. ఆడుకుందామని బాలికను పిలిచిన బాలురు, ఆమెని రేప్ చేసి, చంపి కాలువలో పడేసినట్టుగా పోలీసులకు తెలిపారు. బాలిక కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..
Vande Bharat: వందే భారత్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాలిక దుస్తుల ఆధారంగా గాలింపు మొదలెట్టారు. నిందితుల జాడలను పోలీసు శునకాలు వాసన పసిగట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక చదువుతున్న స్కూల్‌కి చెందిన ఈ ముగ్గురిలో ఇద్దరు ఆరో తరగతి చదువుతుండగా, ఒకడు ఏడో క్లాస్ చదువుతున్నాడు.. బాలికపై అత్యాచారం చేసి, చంపేసి పక్కనే ఉన్న కాలువలో పడేశామని పిల్లలు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు..
బాలక మృతదేహాం కోసం గాలిస్తున్నారు. ఆరో క్లాస్ చదువుతున్న పిల్లలు, హత్యాచారం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో, ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీవీ పెడితే చాలు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న ప్రోగ్రామ్స్, సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు, మితిమీరిన హింస, అల్ఫా మేల్ అంటూ హీరోయిజానికి పైత్యాన్ని చూపించే ఎలివేషన్స్.. ఇవన్నీ పిల్లల బుర్రలను ఎంతగా పాడుచేస్తున్నాయో ఈ దారుణ సంఘటనే సాక్ష్యం..
Capgras Syndrome : కాప్‌గ్రాస్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా..!?
తెలిసి తెలియని వయసులో పిల్లల మనసులో ఇంతటి దారుణం చేసేలా ఉసిగొల్పిన విష బీజం నాటింది ఈ సోసైటీయే. ఇప్పుడు ఆ పిల్లలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మైనర్లు కాబట్టి బోర్డింగ్ స్కూల్‌కి పంపించి, వదిలిపెడతారా? అలా చేస్తే ఇలాంటి ఆలోచన ఉన్నవారికి, ఏం చేసేనా శిక్ష పడదనే భరోసా ఇచ్చినట్టు కాదా?