Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారాహి మాల ధరించారు. వారాహి మాత అమ్మవారి పేరు మీద ధరించే ఈ మాల ఎంతో శక్తివంతమైనది. కఠిన నియమాలతో కూడుకున్నది. అయ్యప్ప మాల మాదిరిగానే ఇందులో కూడా దీక్ష చేపట్టినవాళ్లు, చెప్పులు కూడా వేసుకోకూడదు..
తాజాగా పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యాడు. అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కాళ్లకు చెప్పులు ధరించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షణం తీరిక లేకుండా పల్లెలు, పట్టణాలు అని తిరగాల్సి వస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ కాళ్లకు చెప్పులు లేకుండా నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన గురు స్వాములను అడిగి అత్యవసర పరిస్థితుల్లో దీక్షలో ఉన్నవాళ్లు కూడా చెప్పులు ధరిస్తే తప్పు లేదని తెలుసుకున్నాక చెప్పులు వేసుకున్నాడట..
Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..
ఎన్నికలకు ముందు పార్టీ ప్రచారానికి వాడిన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టాడు పవన్ కళ్యాణ్. వారణాసి గ్రామ దేవత వారాహి. కాశీలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్లాలంటే ఉదయం 4:30 నుంచి 8 గంటలలోపే అనుమతి ఉంటుంది.. అంతేకాకుండా అమ్మవారిని నేరుగా దర్శించుకోవడానికి వీలు ఉండదు. నేలపై ఉండే 2 రంధ్రాల్లో ఓ రంధ్రం నుంచి అమ్మవారి ముఖం, రెండో రంధ్రం నుంచి పాద ముద్రలను దర్శించుకోవాల్సి ఉంటుంది.