Indian 2 Ticket Rates : హైదరాబాద్‌లో సినిమా చాలా ఖరీదైన విషయంగా మారిపోయింది. ఒకప్పుడు రూ.50 పెట్టి బాల్కనీ, రూ.10 పెట్టి నేల క్లాస్‌లో సినిమా చూసేవాళ్లు. అయితే ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లో నేల క్లాస్‌కి కనీసం రూ.50 పెట్టాల్సి వస్తోంది. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఇది కూడా మరింత పెరిగి రూ.80కి చేరుకుంటుంది. బాల్కనీలో కూర్చొని, కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే ఒక్క టికెట్‌కి రూ.250 దాకా పెట్టాల్సింది. బుక్‌మై షో వంటి యాప్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే ట్యాక్స్‌లు, సర్వీస్ ఛార్జీలతో కలిపి అది రూ.270 నుంచి రూ.300 వరకూ పెరుగుతుంది.
Indian 2 Trailer : కనిపించని శంకర్ మార్క్! ఏదో మొక్కుబడిగా చేశాడా..
ఇన్నాళ్లు ఈ టికెట్ ధరల పెరుగుదల కేవలం స్ట్రైయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకి కూడా వ్యాపించింది. సినిమా టికెట్ ధరలు పెంచాలంటే డ్రగ్స్ వ్యసనంపై అవగాహన వీడియోలు చేయాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం.. తొలుత దీన్ని తిరస్కరించిన హీరో సిద్ధార్థ, ‘భారతీయుడు 2’ సినిమా కోసం అవేర్నెస్ వీడియోలు చేశాడు..
దీంతో తెలంగాణ ప్రభుత్వం మారు మాట్లాడకుండా హైక్ ఇచ్చేసింది. ‘భారతీయుడు 2’ సినిమాకి సింగిల్ స్క్రీన్స్‌పై రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 పెరిగింది. ఇక్కడ హైదరాబాద్‌లో ‘భారతీయుడు 2’ సినిమా టికెట్ ధర రూ.350 ఉంటే, చెన్నైలో మాత్రం రూ.190 మాత్రమే.. అంటే అక్కడ సొంత భాష సినిమాకి దక్కని వెసులుబాటు ఇక్కడ దొరుకుతోంది.
Indian 2 Movie : అసలు కథంతా భారతీయుడు 3లోనే!
ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో మాత్రమే సినిమా చాలా ఖరీదైన కాలక్షేపం. ఇప్పుడు ఈ లిస్టులో హైదరాబాద్ కూడా చేరేలా కనిపిస్తోంది. సరదాగా కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలంటే వేలకు వేలు ఖర్చు అవుతుందని భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. థియేటర్లలో సినిమాల ఆయుష్షు తగ్గడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు అభిమానులు..