MS Dhoni Birthday Special : ఇండియా టీం కి కెప్టెన్లు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరు మాత్రమే అందరికీ గుర్తుండిపోతారు. అలా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే వాడే Mr. Cool మహేంద్రసింగ్ ధోని. ధోని జులై 7, 1981 లో ఝార్ఖండ్ లోని రాంచీలో జన్మించాడు. ధోని తొలి వన్డే డిసెంబర్ 23, 2004 బంగ్లాదేశ్ తో ఆడగా, తొలి టెస్ట్ డిసెంబర్ 2, 2005 లో శ్రీలంక తో ఆడాడు. తొలి టీ20 డిసెంబర్ 1, 2006 సౌత్ ఆఫ్రికాపై ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్నాడు.
ధోని తనదైన బ్యాటింగ్ శైలితో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ధోని హెలికాఫ్టర్ షాట్ అయితే ఇప్పటి Young Cricketers కూడా అనుకరిస్తూ ఉంటారు. ధోని తన కెప్టెన్సీలో అనేక మ్యాచుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ధోని ప్రయత్నించి ఓడిపోవచ్చు కానీ అలా ప్రయత్నించి చాలాసార్లు గెలిచాడు.
ఓడిపోయాడు అని మనం విమర్శించొచ్చు కానీ ఆటగాళ్లలో అలా ప్రయత్నించే వాళ్ళు తక్కువ, ప్రయత్నించి గెలిచిన వాళ్ళు ఇంకా తక్కువ.
ధోని ఆ ప్రయత్నంలో ఎప్పుడు ఓడిపోలేదు.
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..
అది 2007..
మొదటి T20 World Cup. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమ్ ఇండియాని ఏకంగా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు ధోని. Finalలో India తో ఆడుతున్నది చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్.
Ind vs Pak అంటేనే ప్రతి మ్యాచ్ World Cup Final లాగే ఉంటుంది. అలాంటిది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే జరిగితే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
చివరి ఓవర్ లో పాకిస్తాన్ 13 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికే 9 వికెట్లు కోల్పోయింది. ధోని పెద్దగా అంచనాలు లేని జోగిందర్ శర్మ కి బౌలింగ్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.
మొదటి బాల్ వైడ్..
6 బంతులకి 12 కి వచ్చింది స్కోర్..
మరో బాల్ డాట్..
రెండో బాల్ కి SIX..
ఇక చివరి 5 బంతులకి కొట్టాల్సింది కేవలం 6 పరుగులు మాత్రమే!
అభిమానులంతా నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్ ను చూస్తున్నారు. మూడో బాల్ కి స్కూప్ షాట్ ఆడబోయిన మిస్బహ్-ఉల్-హక్ శ్రీశాంత్ కి దొరికిపోయాడు. అంతే.. 5 పరుగులతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇక అభిమానుల ఆనందానికి అవధులు లేవు. భారత్ లో సంబరాలు, అంబరాన్నంటాయి. కుర్రాళ్లంతా రోడ్ల మీదకు వచ్చి బాణా సంచా కాలుస్తూ, స్వీట్స్ పంచుకుంటూ సందడి చేశారు. 1983లో కపిల్ దేవ్ తర్వాత, భారత్ కి మరో చిరస్మరణీయమైన విజయాన్నందిచాడు మహేంద్రుడు.
Rahul Dravid : కోచ్ లందు రాహుల్ ద్రావిడ్ వేరయా..
ధోనీ.. టీం ఇండియాకు ఎన్నో తిరుగులేని విజయాలు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. వికెట్ల వెనుక చురుగ్గా కదిలి Stump Outs చేయడంతో పాటు బ్యాటింగ్ లో వికెట్ల మధ్య చిరుతలా పరిగెడతాడు.
Fielder కొంచెం ఆదమరిచి ఉన్నాడా అంతే సంగతి.. సింగిల్ కాస్త 2D (Declared), 2D కాస్త 3D అవుతుంది. గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు 3వ స్థానంలో వచ్చి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను తలుచుకుంటే కెప్టెన్ అయ్యాక కూడా అదే స్థానంలో రావొచ్చు కానీ యువతకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కోహ్లీ లాంటి గొప్ప క్రికెటర్ ని ధోని కెప్టెన్సీలోనే చూసాం. అంతే కాదు రోహిత్ శర్మ ఓపెనింగ్ లో వచ్చింది కూడా ధోని కెప్టెన్సీ లోనే.. ఆ తరువాత రోహిత్ ఆ స్థానంలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
1983 World Cup History : వరల్డ్ కప్ ను ముద్దాడిన వేళ..
ఇలా ఎంతోమంది యంగ్ క్రికెటర్స్ కి అవకాశం ఇచ్చి, ప్రోత్సహించింది ధోనినే. అంతేకాదు అనేక మంది యంగ్ క్రికెటర్స్ ధోని నాయకత్వంలో ఆడాలని ఆశించారు. ఎప్పుడు ఏ కప్పు గెలిచినా.. అది టీంకి ఇచ్చి తను ఎక్కడో చివరన నిలుచుంటాడు, అంత నిరాడంబరుడు మన మహీ. భారత క్రికెట్ టీమ్‌కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మహేంద్రుడు సైలెంట్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు.
ధోని సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం..
క్రీడల్లో అత్యున్నత పురస్కరమైన ఖేల్ రత్న అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అలాగే భారత పౌర అత్యున్నత పురస్కారాలైన పద్మ శ్రీ, పద్మ భూషన్ అవార్డులను కూడా ధోని సొంతం చేసుకున్నాడు. “నాయకత్వం అంటే దారి పొడవునా తనే నడవడం కాదు.. బాట వేయటం.. దారి చూపటం”. మన మహేంద్రసింగ్ ధోని చేసింది కూడా అదే.