Swarnagiri Temple : ఈ మధ్య ఎక్కడ చూసినా స్వర్ణ గిరి టెంపుల్ గురించే వినిపిస్తుంది. అందరూ అక్కడికి వెళ్లి ఫోటోలు దిగడం, వాటిని స్టేటస్ లో పెట్టడం చేస్తున్నారు. యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా ఎక్కడ చూసినా ఈ స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి గురించే. ఈ ఆలయం హైదరాబాదు నుంచి 50 కిలోమీటర్లు దూరంలో, వరంగల్ కి వెళ్తూ భువనగిరి రాకముందు ఉంది.
ఈ ఆలయం ఎలా కట్టారో, ఎక్కడ ఎక్కడ ఏముందో తెలుసుకుందాం..
రోడ్డు మీదనే పెద్ద ఆర్చ్ ఉంటుంది గోవింద నామాలతో. లోపలికి వెళ్ళగానే ముందుగా బ్రహ్మరథం దర్శనమిస్తుంది. అలా కొంచెం ముందుకెళ్లగానే స్వామి వారి పాదాలు కనిపిస్తాయి. ఇది రెండు కళ్ళు సరిపోనంత అందంగా ఉంటాయి. అలా ముందుకు వెళ్తే 108 మెట్లు అలాగే 10 దశావతార మండపాలు ఉంటాయి. అందులో వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క అవతారం ఉంటుంది. ఆ లోపలికి వెళ్లే మార్గాన్ని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఆ 108 మెట్లకి కూడా ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఒక్కో మెట్టు జస్ట్ నాలుగు ఇంచుల ఎత్తు మాత్రమే ఉంటుంది. మెట్లు ఎక్కే వారికి ఎలాంటి అలసట ఉండదు. అసలు మెట్లు ఎక్కుతున్న ఫీలింగ్ కూడా అనిపించదు. అదే ఇక్కడి ప్రత్యేకత.
Murudeshwar temple Gokarna : మురుడేశ్వర ఆలయ విశిష్టత..
అలా మెట్లకి పైకి వెళ్ళగానే ఒకపక్కగా గరుడ వాహనం ఉంటుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్తే కోనేరు ఉంటుంది. దానికి ముందు లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది. ఈ కోనేటిలో జల నారాయణుడు విగ్రహం ఉంటుంది. ఈ జల నారాయణుడు విగ్రహం ఒకటి నేపాల్ లో ఉండగా, రెండోది ఈ స్వర్ణ గిరిలో కోనేటిలో మాత్రమే ఉంది. ఒకపక్కగా ఆంజనేయస్వామి ఏకశిలా విగ్రహం 120 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. ఆ ఆంజనేయ స్వామి తయారు చేయడానికి తిరుమల నుంచి ఏకశిలా తెప్పించారు. అలాగే ఆంజనేయ స్వామి హంపి రథం మీద మనకి దర్శనం ఇస్తారు. ఆ రధం తయారు చేయడానికి సుమారు ఐదు సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయం పూర్తవడానికి సుమారు ఏడు సంవత్సరాలు పట్టింది.
అలాగే ఆంజనేయస్వామికి ఎదురుగా ఒక పెద్ద గంట ఉంటుంది, అది సుమారు ఒకటిన్నర టన్నుల బరువు ఉంటుంది. మన ఆసియా ఖండంలోని అతి పెద్ద గంట ఇది. చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఈ ఆలయ విగ్రహాల ప్రతిష్ట జరిగింది. స్వర్ణ గిరి క్షేత్ర దర్శనం మహా పాప వినాశనం. ఒకసారి ఈ క్షేత్రంలో అడుగుపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఆజన్మ పాపాలు అన్ని తొలగిపోతాయని పురాణాల్లో పేర్కొన్నారు. అంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది.
Ahobilam Temple History : అహోబిలం పుణ్యక్షేత్రం విశేషాలు..
ఇక్కడున్న మరొక విశిష్టత:
ఈ గుడికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ బంగారపు బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్లతో శ్రీవారికి సేవ కార్యక్రమాలు చేస్తారు. అలాగే అక్కడ కళ్యాణమండపం, కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇంకా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది కలియుగ స్వర్ణ గిరి. యాదాద్రి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం గా పిలవబడుతుంది. చీకటి పడిన తర్వాత, విద్యుత్ వెలుగులతో ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది.