Kamal Haasan : శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’, ఇండియాలో బిగ్గెస్టు హిట్టుగా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా 2.0 మూవీని తీశాడు శంకర్. 2.0 మూవీ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో పక్షి రాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. నిజానికి ఈ సినిమాలో విలన్ పాత్రలో కమల్ హాసన్‌ని అనుకున్నాడట డైరెక్టర్ కమల్ హాసన్..
‘రోబో సినిమాని నేనే చేయాల్సింది. కానీ కొన్ని బిజినెస్ లెక్కల కారణంగా ఆ సినిమాని చేయలేకపోయాం.. రోబోకి సీక్వెల్‌గా 2.0 మూవీ తీస్తున్నప్పుడు విలన్‌గా చేయమని అడిగారు. నేను ఒక్కటే చెప్పాను, నేను ఇంకొన్ని రోజులు హీరోగా చేయాలని అనుకుంటున్నా.. అని! మరి కల్కి మూవీలో విలన్‌గా చేశారు కదా అని అడుగుతున్నారు.. నిజానికి నా పాత్ర ఈ మూవీ రెండు పాత్రలో తెలుస్తుంది. ఆ తర్వాత సుప్రీమ్ యాస్కిన్ పేరుతో ఓ సెపరేట్ సినిమా కూడా చేస్తున్నాం..’ అంటూ చెప్పుకొచ్చాడు కమల్ హాసన్..
‘రోబో’ మూవీ, ఉపేంద్ర మూవీకి కాపీయా..? శంకర్ కంటే చాలా ఏళ్ల ముందే..
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా ‘రోబో’ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చాడు శంకర్. అయితే అప్పుడు డైరెక్టర్ శంకర్‌తో పని చేయడానికి కమల్ హాసన్ ఇష్టపడలేదు. దీంతో కమల్ హాసన్ ప్లేస్‌లో రజినీకాంత్‌ని, ప్రీతి జింటా ప్లేస్‌లో ఐశ్వర్యా రాయ్‌ని తీసుకొని, ‘రోబో’ పూర్తి చేశాడు శంకర్..