Fahadh Faasil Case : ‘పుష్ప’ సినిమాలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్‌పై కేసు నమోదైంది. ఈ సినిమా తర్వాత ఫహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగులోకి డబ్ చేయకపోయినా మలయాళం వర్షన్‌నే సబ్ టైటిల్స్‌తో చూసి ఎంజాయ్ చేశారు ఈ సినిమాని తెలుగు జనాలు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ ఫాజిల్‌పై కేసు నమోదైంది.
తెలుగులో సూపర్ హిట్టైన ‘ప్రేమలు’ నిర్మాత ఫహద్ ఫాజిలే. అలాగే ‘ఆవేశం’ మూవీకి కూడా అతనే నిర్మాతగా వ్యవహరించాడు. ‘ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్’ బ్యానర్‌లో ‘పింకేలీ’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని అంగమలై ఏరియాలోని ఎర్నాకులం ప్రభుత్వాసుపత్రిలో జరిపారు.
Naga Shaurya – Darshan : కన్నడ హీరో దర్శన్‌కు నాగశౌర్య మద్దతు..
గురువారం రాత్రి మొత్తం ఇక్కడ షూటింగ్ చేయడంతో ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చే పేద, మధ్యతరగతి రోగులు, వారి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అదీకాకుండా ఈ సినిమా షూటింగ్‌ని ఎమర్జెన్సీ వార్డులో (ICU) జరపడంతో ఎమర్జునీ రోగుల చికిత్సకి ఆటంకం కలిగింది. దీంతో ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఎర్నాకుల జిల్లా వైద్యాధికారి బీనా కుమారి దృష్టికి ఈ విషయం రావడంతో ప్రభుత్వాసుపత్రి ఎమర్జెన్సీ వార్డును షూటింగ్‌కి అనుమతించిన అధికారులపై, అలాగే చిత్ర నిర్మాత ఫహద్ ఫాజిల్‌పై కేసు నమోదు చేశారు.