Kalki Vs Guntur Kaaram : ‘కల్కి 2898AD’ రెండో రోజు సూపర్ హిట్ వసూళ్లు రాబట్టింది. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.19.21 కోట్ల షేర్ రాబట్టింది ‘కల్కి’. నైజం నుంచి రూ.10.05 కోట్ల షేర్ రాగా, సీడెడ్ నుంచి రూ.2.25 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి రూ.2.1 కోట్లు వచ్చాయి.. తొలిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.44.39 కోట్ల షేర్ వసూలు చేసిన ‘కల్కి 2898AD’ మూవీ, రెండు రోజుల్లో కలిపి రూ.63.60 కోట్లు రాబట్టింది.. బీ, సీ సెంట్లర్లలో ‘కల్కి’ వసూళ్లపై ఎఫెక్ట్ పడింది.
సలార్ రెండో రోజు నైజాంలో రూ.10.97 కోట్లు రాబట్టగా, ‘కల్కి 2898AD’ మూవీకి రెండోరోజు కాస్త తక్కువే వచ్చాయి. నార్త్ అమెరికాలో రెండో రోజు 7.64 మిలియన్ డాలర్లను దాటేసిన ‘కల్కి 2898AD’ మూవీ, 10 మిలియన్ డాలర్ల వైపు దూసుకుపోతోంది. హిందీలో ‘కల్కి 2898AD’ రెండో రోజు కలెక్షన్లు రూ.19 కోట్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Kalki 2898 AD Vs Mad Max : కల్కి చూడాలి అనుకునే వాళ్ళు, ఇది చదవకండి..
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లో ‘కల్కి 2898AD’ మూవీ, రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్లలో ‘గుంటూర్ కారం’ రికార్డును ‘కల్కి 2898AD’ మూవీ అందుకోలేకపోయింది. అయితే రెండో రోజు ‘కల్కి 2898AD’ మూవీ, మహేష్ సినిమాని దాటేసింది.. మిక్స్డ్ టాక్తో ‘గుంటూర్ కారం’ రాబట్టిన వసూళ్లను, ‘కల్కి 2898AD’ అందుకోలేకపోవడానికి కారణాలు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సంక్రాంతి సీజన్, మహేష్ సినిమాకి కలిసి రావడం, నాన్ -హాలీడే రోజున సరైన ప్రమోషన్స్ లేకుండా ప్రభాస్ సినిమా రావడమే…