UGC NET Exam : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC-NET, జాయింట్ CSIR UGC NET, NCET (నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలకు కొత్త తేదీలను శుక్రవారం ప్రకటించింది. కొత్తగా జారీ చేసిన నోటీసు ప్రకారం, UGC NET జూన్ 2024 పరీక్షలు ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య నిర్వహించనున్నారు. జాయింట్ CSIR UGC NET జూలై 25 నుండి జూలై 27 వరకు నిర్వహించనున్నారు. NCET పరీక్షలు జూలై 10న జరుగుతాయి.
Banglore News: వేడి భోజనం అందించనందుకు రెస్టారెంట్ కు ఫైన్..
UGC NET జూన్ 2024 పరీక్షను ముందుగా ఆఫ్‌లైన్ మోడ్‌లో OMR షీట్‌లో నిర్వహించారు. దాదాపు 9 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష జరిగిన తర్వాతి రోజే, NET పరీక్షను రద్దు చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆన్‌లైన్ మోడ్‌లో NET నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (AIAPGET) 2024 షెడ్యూల్ ప్రకారం 2024, జూలై 6న జరుగుతుంది. మరింత సమాచారం కోసం సంబంధిత అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ (www.nta.ac.in)ని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు..
జూన్ 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశంలోని వివిధ నగరాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC-NET) పరీక్షను జూన్ 19న విద్యా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. NEET పరీక్ష ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా దాన్ని రద్దు చేసిన విద్యాశాఖ, కొన్ని రోజుల గ్యాప్‌లోనే UGC NET పరీక్షను కూడా రద్దు చేయడం విశేషం.
Lok Sabha session : లోక్ సభలో నీట్ రగడ..
‘పరీక్ష నిర్వహణలో సరైన పారదర్శకత లోపించిందనే అనుమానాలు రావడం వల్లే UGC-NET జూన్ 2024 పరీక్షను రద్దు చేయాలని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.