Paruvu Web series Review : హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం పోలీసులకు దొరికిపోయినట్టుగా ఓ ఫ్రాంక్ వీడియో కూడా చేసి వదిలారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? వేరే కులం వాడిని ప్రేమించిన నివేదా పేతురాజ్, ఇంట్లో నుంచి వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. తన పెదనాన్న చనిపోయారని తెలిసి, తిరిగి పుట్టింటికి బయలుదేరుతుంది. ఆమెని తీసుకెళ్లడానికి వచ్చిన మేనబావ, పరువు కోసం తనను, తన భర్తను చంపేస్తాడేమోనని భయపడి అతన్ని చంపేస్తారు.. ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఆ కేసు నుంచి తప్పించుకున్నారా? ఇదే ‘పరువు’ మెయిన్ పాయింట్.
Deputy CM Pawan Kalyan : బాలకృష్ణకు నచ్చడం లేదా..
కులం, పరువు, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలను చేసే పరువు హత్యల నేపథ్యంలో ‘పరువు’ వెబ్ సిరీస్ సాగుతుంది. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆఖరి ఎపిసోడ్ వరకూ శవాన్ని మాయం చేయడానికి హీరో, హీరోయిన్ పడే కష్టాన్ని థ్రిల్లింగ్ క్యారీ చేయడంలో డైరెక్టర్ సిద్దార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి సక్సెస్ అయ్యారు. మూడు ఎపిసోడ్స్ ముగిసిన తర్వాత ఇదేంటి ఇంత లాగుతున్నారని అనిపిస్తుంది..
ఓ ప్లాన్ అనుకుని, మరో ప్లాన్‌కి మారడం, మళ్లీ దాన్ని కూడా మార్చడం… చూసే ప్రేక్షకులకు కంఫ్యూజన్‌కి గురి చేస్తాయి. కులం మీద సాగిన సబ్జెక్ట్‌కి న్యాయం చేయడం కోసం ఓ పరువు హత్యను జోడించి, దాని చుట్టూ కథ అల్లు కున్నారు. దాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. కానీ తాను కష్టపడి, ఎంతో పేదరికం అనుభవించి పైకి వచ్చానని చెప్పే హీరో పాత్ర, వాచ్‌మెన్‌తో ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తుంది. వయసులో పెద్దవాడు అనే ఆలోచన కూడా ఎందుకు అతన్ని చులకనగా చూస్తాడు.. అక్కడ అతను చేసిందేంటి? ఇలాంటి లాజిక్ లేని విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో..
Tollywood Inside Facts : స్టార్లకు కోట్ల రెమ్యూనరేషన్లు! ఆర్టిస్టుల పొట్ట కొడుతూ..
నటీనటులు అందరూ చక్కగా నటించారు. కానీ డ్రామా ఎక్కువ కావడంతో పాటు సీక్వెల్ కోసం బిందు మాధవి పాత్రను క్వీన్‌లా లాస్ట్‌లో చూపించారు. పవర్ ఫుల్ దొరస్వామి పాత్రను అస్సలు చూపించనే లేదు. మొత్తానికి సీక్వెల్ కోసం ‘పరువు’ వెబ్ సిరీస్‌ని సగంలో ఆపేశారు. అయితే సీక్వెల్ కోసం వెయిట్ చేసేంత క్యూరియాసిటీ మాత్రం జనాల్లో క్రియేట్ చేయలేకపోయారనే చెప్పాలి.. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ యాప్‌లో అందుబాటులో ఉంది.