Vastu Tips : సనాతన ధర్మంలో ఇంటిలో దేవతలను ఆరాధించడంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. చాలామంది తమ పూజా మందిరంలో దేవతల విగ్రహాలను ఉంచి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తువుంటారు. అదే విధంగా దేవత విగ్రహాలను ఆరాధించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కూడా పూజా మందిరంలో ఉంచుతారు. అలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో దేవతలను పూజించడం ద్వారా వారికి మరియు వారి ఇంటిలోని వ్యక్తులకు మంచి జరుగుతుందని నమ్ముతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల జీవితంలో ప్రతికూల ఫలితాలు ఏర్పడడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి పూజా మందిరంలో ఏయే వస్తువులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
PM Modi – Ram Mandir : రామమందిరం కట్టిన చోటే, బీజేపీ ఎందుకు ఓడింది?
పూజా మందిరంలో ఉంచకూడని వస్తువులు :
* వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని పూజా మందిరంలో రుద్ర రూప దేవతామూర్తుల విగ్రహాలను ఉంచకూడదు. అలాగే విరిగిన విగ్రహాలను మరియు పగిలిన దేవుని చిత్రపటాలను కూడా ఉంచకూడదు. ఇలాంటి విగ్రహాలను పూజా మందిరంలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు.
* ఇంటి పూజ మందిరంలో లేదా మందిరం చుట్టుపక్కల పూర్వీకుల చిత్రపటాలను ఉంచడం వల్ల ఇంటిలోని వ్యక్తులకు చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి వెంటనే వాటిని తొలగించండి.
* ఇంటిలోని పూజ మందిరంలో కత్తెర మరియు ఇతర పదునైన వస్తువులను ఉంచకూడదు. మీరు కూడా అలాంటి వాటిని పూజా మందిరంలో ఉంచినట్లయితే, వెంటనే ఆ ప్రదేశం నుంచి వాటిని తొలగించండి. పదునైన వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఉత్పన్నమై అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
* అంతేకాకుండా వాడిపోయిన మరియు ఎండిపోయిన పువ్వులు, చిరిగిపోయిన మతపరమైన పుస్తకాలను పూజా మందిరంలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అందువల్ల, వాటిని పూజా మందిరంలో ఉంచకూడదు.