Narendra Modi : 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతీయ జనాతా పార్టీ. అయితే ఈసారి మాత్రం బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 32 సీట్లు కావాలి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం వంటి పార్టీల సపోర్ట్ కీలకంగా మారింది. ఎన్డీఏ కూటమి సంయుక్తంగా కలిసి ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాడు మోదీ.. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మూడో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ..
జేడీయూ పార్టీ సాధించిన 12 సీట్లతో పాటు తెలుగు దేశం పార్టీ సాధించిన 16 లోక్‌సభ స్థానాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కీలకంగా మారాయి. దీంతో ఈ రెండు పార్టీలు, కేంద్రంలో మంత్రి పదవులను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. జేడీయూ రైల్వే శాఖ మంత్రిని డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం లోక్‌సభ స్పీకర్ పోస్ట్‌ని కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి..
Jr NTR : మామయ్యకి, బాబాయికి, అత్తలకు.. తారక్ ఎంత పొడుగు ట్వీట్ వేసినా..
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అడుగుతున్న తెలుగుదేశం పార్టీకి ఇది సువర్ణావకాశం. అయితే 7 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. దీంతో ప్రత్యేక హోదా కాకపోయినా రాష్ట్రానికి తగినన్ని నిధులు తీసుకురావడంతో పాటు రెండు లేదా మూడు కేంద్ర మంత్రిత్వశాఖలు, తెలుగు దేశం పార్టీకి దక్కేలా పావులు కదుపుతున్నారు చంద్రబాబు నాయుడు.
ఇప్పటికే ఎన్డీఏ కూటమి కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ. అటు జేడీయూ, ఇటు తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఇచ్చినా ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు ఇప్పటికే 17 మంది ఇండిపెండెండ్ ఎంపీలను తన పార్టీలోకి తెచ్చేసుకుంది బీజేపీ. వీరితో కలిసి ఎన్డీయే బలం 302కి చేరింది.