YS Sharmila : అసలైన గేమ్ ఛేంజర్ షర్మిలనే..!

YS Sharmila
YS Sharmila

YS Sharmila : ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం మూటకట్టుకున్నాడు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్పిన జగన్, 11 స్థానాలు మాత్రమే గెలవగలిగాడు. నిజానికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో 10 శాతం సీట్లు కూడా ప్రతిపక్షానికి రాలేదు. టీడీపీ కూటమి వల్లే జగన్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైనా ఇందులో సీక్రెట్ గేమ్ ఛేంజర్ మాత్రం షర్మిలనే..

Brother Anil – YS Jagan : జగన్ జైలులో ఉంటే షర్మిల పాదయాత్ర చేసింది! అధికారం రాగానే దూరం పెట్టారు..

2019లో వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు అన్నను అధికారంలోకి తీసుకొచ్చే, బాధ్యతలు భుజాన వేసుకుంది వైఎస్ షర్మిల. రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయం దక్కడంలో షర్మిల పాత్ర ఎంతో ఉంది. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది షర్మిల. ఆ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడింది.

“Y.S. Sharmila: A Struggle for Justice and Family Loyalty”:జగనన్న వేరు, సీఎం జగన్ వేరు! మా అన్నను మిస్ అవుతున్నా..

2023లో తెలంగాణకి ఫోకస్ మార్చి, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఎన్నికలకు ముందు పోటీ చేయకూడదని షర్మిల తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్‌ని అధికారంలోకి తెచ్చింది. 2024 ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన షర్మిల, సొంత అన్నపైన విమర్శలు చేసింది. సొంత చెల్లెలు, అన్నపైన ఎదురుతిరగడం.. రాజకీయాల్లో చాలా పెద్ద మలుపు. ఇక్కడ కూడా షర్మిల కీ ఫ్యాక్టర్.. తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వైఎస్ షర్మిల, ఆంధ్రాలో అన్న జగన్‌ని సీఎం కుర్చీ ఖాళీ చేయించింది. అయినా షర్మిలకు ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం అతి పెద్ద ట్విస్టు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post