Rules To Drink Tea : చాయ్ చటుక్కున తాగకండి..

Rules to Drink Tea: ఇరానీ టీ, అల్లం టీ, మసాలా టీ, బెల్లం టీ..

నిద్ర లేస్తే టీ.. నిద్ర వస్తే టీ..
నలుగురు వస్తే టీ.. నలుగురు కలిస్తే టీ..
మత్తుగా అనిపిస్తే టీ.. ఏదైనా మొదలు పెట్టే ముందు టీ..
కొంతమందికి టైమ్ నాలుగు ఐతే టీ.. ఇంకొంత మందికి టైమ్ తో సంబంధం లేనిది టీ..
పరిచయాలు పెంచేది టీ..
పంచాయతీలకీ కావాల్సింది టీ..

టీ.. టీ.. టీ.. తలనొప్పి తగ్గాలంటే టీ, ఒళ్ళునొప్పులు తగ్గాలంటే టీ.. చాలామందికి టీ ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. అసలు టీ అనేది లేకపోతే వాళ్లు ఏ పని చేయరేమో.. కొంతమంది జీవితంలో భాగమైపోతుంది ఈ టీ. మరి అలాంటి టీని ఏ టైంలో తాగాలి, వేటితో తాగాలి అన్నది చూద్దాం..

Egg Masala : ఘాటైన గుడ్డు మసాలా..

* కొంతమంది టీలో సమోసా పకోడీ, పకోడీతో సాస్, సాల్ట్ బిస్కెట్ తింటూ ఉంటారు అలా తినకూడదు. అలా తినడం వల్ల పాలల్లో ఉప్పేస్తే ఏమవుతుంది పాలు విరిగిపోతాయి. సో అదే ప్రాసెస్ మన కడుపులో జరిగి, మన స్టమక్ యొక్క Mucus Line పాడైపోతుంది. అప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి కడుపు ఉబ్బడం యాసిడిటీ, అరగకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.

* చాలామంది భోజనం తిన్న వెంటనే టీ తాగడం అలవాటు ఉంటుంది. అది మంచిది కాదు కనీసం భోజనం తర్వాత, భోజనానికి ముందు రెండు గంటలు గ్యాప్ ఉండాలి.

Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..

* ఉదయం వేళల్లో పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే.. ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా ఉంటాయి. అందుకే ఉదయం వేళల్లో టీ, కాఫీలు తీసుకోవడం మానేయడం మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత ఒకసారి, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌తో పాటు మరోసారి తీసుకుంటే చాలు.
* రోజుకు రెండుసార్లు టీ తాగడం వల్ల ఆరోగ్యమే అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఉదయం, సాయంత్రం టీ తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు అహ్లాదంగా కూడా ఉంటుంది.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post