Indian Serials :మీరు ఏదైనా కొత్తగా అలవాటు చేసుకోవాలి అంటే.. 40 రోజులు పాటించండి అంటారు. అంతెందుకు అయ్యప్ప స్వామి దీక్ష కూడా 40 రోజులే ఉంటుంది. దాని ద్వారా మంచి అలవాట్లు అలవాటు చేసుకోవడం కోసం మనం ఏమి చేస్తున్నాం అనేది తర్వాత మాట్లాడుకుందాం.. మనం ఏదైనా పని అంటే.. మంచిచెడు అని తేడా లేకుండా 40 రోజులు చేస్తే దానికి మనం అలవాటు పడటం లేదా వ్యసనంగా మారుతుంది.
అలాగే ఈ ప్రమాదకరమైన సీరియల్ వల్ల కూడా.. అందరూ అనుకుంటునట్టు ఆడవాళ్లు మాత్రమే సీరియల్ చూడటం లేదు, మగవాళ్ళు కూడా చూస్తున్నారు. హమ్మయ్య నేను చూడటం లేదు అనుకుంటున్నారా అయితే మీరు పేడలో కాలు వేసినట్టే!
అవును ఈ మధ్య OTTలో వస్తున్న కొరియన్ Web Series కూడా అక్కడ ఛానెల్ లో సీరియల్స్ గా ఉన్నవే! అందుకే మీరు సీరియల్స్ చూడటం లేదు అని చెప్పకండి ఎందుకంటే మీ పళ్ళలో పాలకూర కనిపిస్తుంది.
మన ఇండియాలో సీరియల్స్ (Indian Serials) గురించి రాయాలి అంటే గ్రంధాలు సరిపోవు. నిత్యం ఇంట్లో ఆ సీరియల్స్ లో ఉన్నట్టు ఉంటే.. ప్రపంచంలో మానసిక ఉన్మాదులు పెరిగిపోతారు అనిపిస్తుంది.
ఒకప్పటి ఈటీవీ, జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్ కి ఇప్పుడు వచ్చే సీరియల్స్ కి :నక్కకి నాగలోకానికి’ ఉన్నంత తేడా ఉంది. 90s కిడ్స్ కి అయితే కొన్ని మరుపురాని సీరియల్స్ ఇవ్వడంలో ఉండే ఈ టీవీ ,జెమినీ టీవీ ఇప్పుడు మిగతా ఛానెల్ సీరియల్స్ లాగానే ఎత్తులు కుయుక్తులతో ఉండే సీరియల్స్ లానే ఉంటున్నాయి.
ఆ మధ్య ఒక సీరియల్ లో చూసాను.. ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, చెల్లిని ఎక్కువుగా తండ్రి ప్రేమిస్తున్నాడని అడుగడుగునా జీవితంలో అడ్డు పడుతూనే ఉంది. మరి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో తెలీదు!
ఇంకో సీరియల్ లో ఏమో అప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లు ఒక్క మగాడి కోసం ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకడరు. ఇంకా పెళ్ళైన అబ్బాయి వెనక పడే ఆడ లేడి విలన్. ఆ అబ్బాయి భార్యని తప్పించి తను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు..
ఏమి ఉంది గర్వ కారణం.. ఎందెందు చూసిన అందందే కలదు అన్నట్టుగా అడుగడుగునా ఆటంకం, ఆ ఆటకాన్ని సాగేస్తూ 20, 30 ఎపిసోడ్స్ లాగి.. చివరిగా కొన్ని వేల ఎపిసోడ్స్ గా అందలం ఎక్కించడం.
ఎంతసేపు ప్రేక్షకుడు ఆగిపోకూడదు అనుకోవడమే కానీ అందులో ఉపయోగం ఏమి ఉండదు. పైగా బుర్రలు పాడు చేసుకోవడం తప్పా…!!
Love Me If You Dare Movie Review : డోంట్ డేర్ టు వాచ్..