Covid Vaccine side effects : ప్రతీ ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్..

Covid Vaccine side effects : కరోనా వైరస్ కారణంగా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్‌‌ని ఎదుర్కోలేక అమెరికా వంటి దేశాలే వణికిపోయాయి. కరోనా నివారణ కోసం రెండు వ్యాక్సిన్‌లను తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. అందులో కోవీషీల్డ్ కరోనా వ్యాక్సిన్ కారణంగా 40 ఏళ్లు నిండిన వారిలో గుండెపోటు, మెదడులో రక్తస్రావం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థ స్వయంగా అంగీకరించింది. ఇప్పుడు ఈ లిస్టులోకి కోవాగ్జిన్ కూడా చేరింది.

కోవీషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ వార్తలతో కోవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందులో ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 926 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు తేలింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో 48 శాతం, 40 ఏళ్లు పైబడిన వారిలో 43 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు మొదలైనట్టు తేలింది.

ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో చాలామందికి రక్తం గడ్డకట్టడంతో పాటు రక్తంలో ఫ్లెట్‌లెట్స్ పడిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. వీటి కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏడాది దాటితే మాత్రం ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉన్నట్టు నిరూపితమైంది..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post