Nandamuri Balakrishna Pan India movie:రూ.150 కోట్లతో బాలయ్య పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్..

NandamuriBalakrishna Pan India movie : బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) నటించిన హ్యాట్రిక్ హిట్టు ‘అఖండ’. ఈ సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్ అనౌన్స్ చేశాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం కె.ఎస్. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ, ఈ మూవీ తర్వాత ‘అఖండ 2’ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీకి రూ.150 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు.

బాలయ్య కెరీర్‌లోనే ఇదే భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. ‘అఖండ’ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్‌ థియేట్రికల్ రిలీజ్‌కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే యూట్యూబ్‌లో రిలీజైన డబ్బింగ్ వర్షన్ మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ‘అఖండ 2’ సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు..

 ‘అఖండ 2’ మూవీ కథపై బోయపాటి శ్రీను (Boyapati Sreenu),చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా అవుతుందని, బాలయ్య కెరీర్‌లో, తన కెరీర్‌లో టాప్ గ్రాసింగ్ మూవీ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడట బోయపాటి శ్రీను.

Prithviraj Sukumaran : బాలయ్యతో సినిమా చేస్తా! కథ కూడా రెఢీ చేసుకున్నా..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post