AP Election 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే పల్లెలకు పయనమయ్యారు ఏపీ ప్రజలు. దీంతో రెండు రోజుల ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులన్నీ ఉదయం 5 గంటల నుంచి ట్రాఫిక్ జామ్తో నిండిపోతున్నాయి. అదీకాకుండా ఓటుకి భారీగా చెల్లించేందుకు రాజకీయ పార్టీలు తయారైపోయాయి. దీంతో పౌర హక్కుగా ఓటు వేసేందుకు కాకపోయినా ఓటుకి ఇచ్చే నోటు కోసమైనా ఊరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు చాలామంది. డిమాండ్ భారీగా పెరగడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకు వెళ్లే బస్సులపై భారీగా ధరలు పెంచేశాయి ట్రావెల్ ఏజెన్సీలు..
Revanth Reddy : నేను శిష్యుడిని కాదు, ఆయన నా గురువు కాదు..
ఇంతకుముందు ఉన్న ధరలతో పోలిస్తే ఏకంగా 50 నుంచి 200 శాతం అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా సంక్రాంతి సీజన్ సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు ఇలాంటి డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలకు ముందు ఇలాంటి హడావుడి కనిపిస్తోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు రోజుల ముందుగానే ఇలా 4 లక్షల 32 వేలకు పైగా బ్యాలెట్ ఓట్లు చేరాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన బ్యాలెట్ ఓట్ల సంఖ్య 1.2 లక్షలు మాత్రమే. అంటే ఇప్పటికే దానికి నాలుగింతలుగా బ్యాలెట్ ఓట్లు వచ్చేశాయి. మే 13న నాటికి మరిన్ని బ్యాటెల్ ఓట్లు రావచ్చు.. ఇదే జోరు కొనసాగితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..