Baak Movie Review : గ్లామరస్ హార్రర్ కామెడీ..

Baak Movie Review : ‘చంద్రకళ’, ‘కళావతి’, ‘అంతఃపురం’ వంటి హార్రర్ కామెడీ సినిమాలతో తమిళంలో రాఘవ లారెన్స్‌ ‘కాంచన’ సీక్వెల్స్‌తో పోటీపడుతున్నాడు డైరెక్టర్ సుందర్ సి… తెలుగులో మూడు సీక్వెల్స్‌కి మూడు భిన్నమైన పేర్లు పెట్టినా, తమిళంలో మాత్రం ‘అరన్‌మనై, ‘అరన్‌మనై 2’, ‘అరన్‌మనై 3’ పేరుతో ఈ సినిమాలు విడుదలైంది. ఈ సీక్వెల్స్‌లో వచ్చిన నాలుగో సినిమా ‘అరన్‌మనై 4’. తమన్నా భాటియా, రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ చేశారు…

తన సినిమాలో హీరోయిన్‌ ప్రధాన పాత్ర పోషించినా కీ రోల్‌లో తానే స్వయంగా నటిస్తూ ఉంటాడు సుందర్ సి.. ఈ సినిమాలోనూ నటించాడు. లాయర్ శరవణన్ చెల్లెలు తమన్నా, ప్రేమించి పెళ్లి చేసుకోని అన్నను వదిలి వెళ్లిపోతుంది. చెల్లెలి ఆచూకీ కోసం అన్న వెతుకుతూనే ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు, తన చెల్లెలి భర్త చనిపోయినట్టుగా శరవణన్‌కి తెలుస్తుంది. తన చెల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలుపుతారు. ఈ కేసుని విచారించేందుకు తన కుటుంబంతో కలిసి చెల్లెలు నివాసం ఉన్న ఓ ఫారెస్ట్‌లో ఫామ్‌ హౌస్‌కి మారతాడు హీరో..

OMG 2 Telugu OTT : టీనేజ్ పిల్లలు తప్పక చూడాల్సిన A సర్టిఫైడ్ సినిమా..

అక్కడ వారికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అనేదే ‘బాక్’ సినిమా. హార్రర్ కామెడీకి హీరోయిన్ల గ్లామర్‌ని జోడించడం సుందర్‌కి బాగా అలవాటు. అందుకే ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నాల గ్లామర్ షో యూత్‌ని ఆకట్టుకుంటుంది. అయితే నటన పరంగా రాశి ఖన్నాకి పెద్దగా ఆస్కారం లేదు. అస్సామీ పురాణాల ఆధారంగా కథలో కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుందర్..

అయితే సుందర్ తీసిన గత హార్రర్ సినిమాలను గుర్తుకుతెస్తుంది ‘బాక్’. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ బాగుంది. కోవై సరళ, యోగి బాబు, రాజేంద్రన్ కామెడీ నవ్విస్తుంది. హార్రర్ కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి ఈ ‘బాక్’ నచ్చుతుంది. అయితే తెలుగులో సరైన పబ్లిసిటీ లేకుండా విడుదల కావడంతో ‘బాక్’ అనే సినిమా వచ్చినట్టే చాలామందికి తెలీదు.. ఇది కలెక్షన్లపై ప్రభావం చూపించొచ్చు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post