Venky Atluri : ఆరు పాటలు, మూడు ఫైట్లు లేకపోతే తెలుగు హీరోలు సినిమాలు చేయరు. కథ, కంటెంట్ చూసి సినిమాలు చేయడం ఎప్పుడో మానేశారు తెలుగు హీరోలు. ‘స్నేహ గీతం’ మూవీలో హీరోగా నటించిన వెంకీ అట్లూరీ, వరుణ్‌తేజ్‌తో ‘తొలిప్రేమ’ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు.. ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’, నితిన్‌తో ‘రంగ్ దే’ సినిమాలు చేశాడు.
రొటీన్ సినిమాలు చేసే డైరెక్టర్‌గా ముద్ర పడిన వెంకీ అట్లూరి, తమిళ్లోకి వెళ్లగానే ధనుష్‌తో ‘సార్’ మూవీ చేశారు.. గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకు చదువు చెప్పడం కోసం కష్టాలు పడే టీచర్ కథను వెంకీ అట్లూరీ రాసుకున్న విధానం, తెరకెక్కిన తీరు చూసి జనాలు ఫిదా అయిపోయారు.
Nora Fathehi : డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటారు, డిప్రెషన్లోకి వెళ్తారు..
ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మూవీ చేస్తున్నాడు వెంకీ అట్లూరి.. మనవాళ్లతో రాడ్ సినిమాలు చేసిన వెంకీ, ఇండస్ట్రీ మారిన తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. అంటే కంటెంట్ ఉన్న దర్శకులు మన దగ్గర ఉన్నా, వాళ్లతో కథా బలం ఉన్న సినిమాలు చేయడానికి మనవాళ్లు రెఢీగా లేరని తేలిపోయింది.
‘సార్’ సినిమా విషయానికి వస్తే ధనుష్ చేసిన పాత్రలో ఎన్టీఆర్, లేదా మహేష్‌ని ఊహించుకోగలమా? లేదా కనీసం వరుణ్ తేజ్, నితిన్ లాంటి టైర్ 2 హీరోలు అయినా ఇలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారా? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు..