DeAr Movie Review : మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాశ్ సినిమాల సెలక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది. ప్రెజెంట్ మనోడు చేసిన సినిమా ‘DeAr’. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 11న విడుదలైంది. ట్రైలర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన ఈ ‘డియర్’, ప్రేక్షకులను మెప్పించగలిగిందా?
మీడియాలో పనిచేసే హీరోకి చిన్న శబ్దం వచ్చినా సరిగ్గా నిద్ర పట్టదు.. అలాంటి హీరోకి పెద్దగా గురక పెట్టే హీరోయిన్‌తో పెళ్లి అవుతుంది. శోభనం రోజే తన భార్యకి ఉన్న గురక అలవాటు గురించి హీరోకి తెలుస్తుంది. ఈ అలవాటు కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. చివరికి ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది. ఇదే ‘DeAr’ మూవీ కథ.
Maidaan Movie Review : బాలీవుడ్ మరో స్పోర్ట్స్ డ్రామా..
ఇదే కథతో మలయాళంలో ‘గుడ్ నైట్’ అనే సినిమా వచ్చింది. ఆ మూవీ తెలుగులో ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ‘గుడ్ నైట్’ మూవీలో హీరోకి గురక అలవాటు ఉంటే, ఇక్కడ హీరోయిన్‌కి ఉంటుంది. ఇది తప్ప హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ ఇలా మిగిలిన ఎమోషన్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఒకేలా అనిపిస్తాయి.
‘గుడ్ నైట్’ మూవీ చూడని వాళ్లు ఈ ‘DeAr’ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. చూసినవాళ్లకు కూడా కొన్ని సీన్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి. సున్నితమైన విషయానికి హాస్యం, ఆ తర్వాత ఎమోషన్స్ జోడించి చూపించడంలో డైరెక్టర్ ఆనంద్ రవిచంద్రన్ బాగానే సక్సెస్ అయ్యాడు. జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్యా రాజేశ్ యాక్టింగ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్.. జీవీ ప్రకాశ్ ఈ సినిమాకి హీరో మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా.. అతను అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఆకట్టుకుంది..