Bade Miyan Chote Miyan Review : అక్షయ్ కుమార్ నటించిన ‘OMG 2’కి ముందు అరడజనుకి పైగా సినిమాలు డిజాస్టర్లు. ఆ సినిమా తర్వాత అక్షయ్ చేసిన ‘మిషన్ రాణిగంజ్’ కూడా అట్టర్ ఫ్లాప్. ‘టైగర్ ష్రాఫ్’ పరిస్థితి కూడా ఇదే. సోనాక్షి సిన్హా; మానుషి ఛిల్లర్ కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇలా ఫ్లాపుల్లో ఉన్న వాళ్లంతా కలిసి చేసిన సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’..
ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాకి ఉన్న ఏకైక పాజిటివ్ విషయం అదే.. ఇంతకుముందు ‘మేరే బ్రదర్ కి దుల్హన్’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి సూపర్ హిట్స్ తీసిన ఆలీ అబ్బాస్ జాఫర్, ఈ సినిమాని పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచాడు..
హిమాలయ శిఖరాల్లో తలదాచుకునే విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్, భారత్‌కి చెందిన అత్యంత పవర్ ఫుల్, సాంకేతికత ఉన్న ఆయుధాలను దొంగిలిస్తాడు. దీనికి ప్యాకేజ్ అనే కోడ్ నేమ్ పెడతాడు. భారత ఆర్మీకి 72 గంటల్లో తనను ఆపమని, లేకపోతే దేశంలో విధ్వంసం సృష్టిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. దీంతో ఆర్మీ నుంచి ఇద్దరు మాజీ ఆర్మీ అధికారులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లను పంపిస్తారు. వీరికి కెప్టెన్ మానుషి ఛిల్లర్ సహాయకురాలిగా ఉంటుంది. వీళ్లు ఈ మిషన్‌ని ఎలా నడిపించారు? ఎలా సక్సెస్ అయ్యారు అనేదే ‘బడే మియాన్ చోటా మియాన్’ మూవీ కథాంశం..
Maidaan Movie Review : బాలీవుడ్ మరో స్పోర్ట్స్ డ్రామా..
ఇలాంటి కథలతో కొన్ని వేల సినిమాలు వచ్చాయి. అందులో కథ, కథనం రెండింట్లోనూ ఈ మూవీలో కొత్తదనం ఉండదు. అయితే యాక్షన్ సీన్స్ విషయంలో అబ్బాస్ చాలా కేర్ తీసుకున్నాడు. కొన్ని సీన్స్ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ‘టైగర్ జిందా హై’ మూవీలో యాక్షన్‌కి ఎమోషన్ని మిక్స్ చేసి సక్సెస్ అయిన ఆలీ అబ్బాస్, ఇందులో దాన్ని మిస్ అయ్యాడు..
సినిమాలో చాలా సీన్స్ సాగతీతగా ఉంటాయి. కెమెరా వర్క్ బాగున్నా, మ్యూజిక్ వర్కవుట్ కాలేదు. ఎప్పటిలాగే యాక్షన్ సినిమాలో గ్లామర్ ఒలికించడానికి మానుషి ఛిల్లర్, అలయా, సోనాక్షి సిన్హాలను పెట్టారు. పృథ్వీరాజ్ టాలెంట్ తెలిసిన వాళ్లకి అతనికి ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ఎంత తేలికే అర్థమైపోతుంది. అయితే అతనికి సరైన క్యారెక్టర్ని రాయలేదు డైరెక్టర్… ఓవరాల్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హిట్టు బొమ్మ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో..