Maidaan Movie Review : బాలీవుడ్లో ఇంతకుముందు ‘దంగల్’, ‘గోల్డ్’, ‘బాగ్ మిల్కా బాగ్’, ‘83’, ‘కౌన్ హై తాంబే’, ‘ఎమ్మెస్ ధోనీ’ వంటి స్పోర్ట్స్ బయోపిక్స్ వచ్చాయి. బాగా ఆడాయి. ఇదే వరుసగా తాజాగా వచ్చిన బాలీవుడ్ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’.. బోనీ కపూర్ నిర్మాతగా అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మైదాన్’ ఏప్రిల్ 10న విడుదలైంది..
1952 ఒలింపిక్స్‌లో భారత ఫుట్ బాల్ జట్టు, అనామక జట్టు చేతుల్లో ఓడుతుంది. అప్పటిదాకా ఫుట్‌బాల్‌కి భారత్‌లో మంచి క్రేజ్ ఉండేది. కాలికి షూస్ లేకుండా ఫుట్‌బాల్ ఆడి పతకాలు గెలిచిన చరిత్ర మనది. దీంతో ఈ ఓటమికి కారణమేంటి? అనే విషయం గురించి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌ని నిలదీస్తుంది భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్.. అతను కొత్త ఆటగాళ్లతో జట్టును పునర్మించి, ఒలింపిక్స్‌ని టీమ్‌ని ఎలా తయారుచేశాడు? అనేదే ‘మైదాన్’ మూవీ కథాంశం..
Love Guru Review : విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ డ్రామా..
భారత్ ఫుట్‌బాల్ టీమ్ ఇప్పుడు సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన ఆరంభంలో భారత ఫుట్ బాల్ జట్టు వైభవం వేరు. ఆ విషయాలను బయటికి తీయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. అజయ్ దేవగణ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులకు తెర మీద సయ్యద్ అబ్దుల్ రహీమ్ మాత్రమే కనిపించేలా చేశాడు..
ఫుట్‌బాల్ మ్యాచ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు అందరూ అద్భుతంగా నటించారు. కథలోకి లీనం చేసేందుకు దర్శకుడు కొంత సమయం తీసుకోవడంతో ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. ఏఆర్ రెహ్మాన్ అందించిన మ్యూజిక్, ఈ సినిమా ప్లస్ పాయింట్. క్లైమాక్స్ కూడా అందరూ ఊహించేదే అయినా బాగా వర్కవుట్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా మూవీలను ఇష్టపడేవాళ్లకు ‘మైదాన్’ కచ్ఛితంగా నచ్చుతుంది.