Tillu Square Collections : 3 రోజుల్లోనే హిట్టు కొట్టేసిన టిల్లు.. రూ.100 కోట్లు కొట్టేలాగే ఉన్నాడే..

Tillu Square Collections : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘టిల్లు స్క్వైర్’ మూవీ, మార్చి 29న విడుదలైంది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా మొత్తంగా రూ.27 కోట్లు వసూలు చేస్తే, ‘టిల్లు స్క్వైర్’ మూవీని రూ.30 కోట్లకు అమ్మారు. అయితే కేవలం మూడు రోజుల్లోనే ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టి, సూపర్ హిట్టు కొట్టేసింది ‘టిల్లు స్క్వైర్’ మూవీ.. ఆదివారం వసూళ్లతో ‘టిల్లు స్క్వైర్’ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో విడుదలైన టాలీవుడ్ సినిమాల్లో ఆరో క్లీన్ హిట్ ‘టిల్లు స్క్వైర్’..

Tillu Square Review : సిద్ధూ క్రేజీ షో! కానీ కొత్తదనం మిస్సింగ్..

‘హనుమాన్’, ‘నా సామి రంగ’, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘గామి’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలు టాలీవుడ్ నుంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి ‘టిల్లు స్క్వైర్’ కూడా చేరిపోయింది. మలయాళ డబ్బింగ్ మూవీ ‘ప్రేమలు’ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది.

‘టిల్లు స్క్వైర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ అన్నాడు. చెప్పినట్టుగానే ఇప్పటికే ఈ మూవీ మొదటి 3 రోజుల్లో రూ.70 కోట్ల వరకూ రాబట్టింది. సిద్ధూ జొన్నలగడ్డ పంచ్ డైలాగ్స్, అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. కథ పెద్దగా లేకపోయినా యూత్‌కి బాగా కనెక్ట్ కావడంతో ఈ మూవీ ఈజీగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేలా ఉంది… వచ్చే వారం ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్’ మూవీకి మిక్స్‌డ్ టాక్ వస్తే, అది ‘టిల్లు’ మూవీ కలెక్షన్లను మరింత పెంచవచ్చు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post