Telugu States Merged Parties : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రాజకీయ సందడి మొదలైంది. వైఎస్ షర్మిల, తాను స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.
ఇలా విలీనమైన పార్టీలు ఎన్నో, మరెన్నో.. సీనియర్ ఎన్టీఆర్ మరణించాక తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అయ్యాడు. ఆ సమయంలో ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీ పెట్టింది.
AP Politics : మూడు పార్టీలు, మూడు క్యాపిటల్స్.. రాజధాని రాజకీయం..
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా రోజుల పాటు సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ, కొన్ని కారణాల వల్ల ‘అన్న టీడీపీ’ పార్టీని స్థాపించాడు. అయితే ఈ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి.
ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయాలని, ఎన్నికలకు 7 నెలల ముందు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఎన్నికల్లో ఘోర ఓటమితో తన పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీతో వెళ్లి ఘోర ఓటమి చెందాడు.
అలాగే దేవేందర్ రెడ్డి సారథ్యంలో నవ తెలంగాణ, విజయ్ శాంతి నాయకత్వంలో తల్లి తెలంగాణ వంటి పార్టీలు పుట్టుకొచ్చాయి. టంగుటూరి ప్రకాశం పంతులు, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ పేరుతో ఓపార్టీని స్థాపించగా, ఎన్.జీ. రంగా నాయకత్వంలో కృషికార్ లోక్‌పార్టీ ఏర్పాటైంది.
Arvind Kejriwal Arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కదులుతున్న పావులు..
అలాగే మర్రి చెన్నారెడ్డి, డెమోక్రటిక్ పార్టీని స్థాపించగా, తెన్నేటి విశ్వనాథం లీడర్‌షిప్‌లో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీలన్నీ కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీలో, మరికొన్ని ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీలో విలీనం అయిపోయాయి.. జయ్‌ప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్‌సత్తా పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోయింది.