IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించేందుకు మరికొన్ని గంటల్లో సిద్ధమవుతోంది. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కొన్ని గంటల ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. మొదటి సీజన్ నుంచి 15 సీజన్ల పాటు చెన్నైకి కెప్టెన్సీ చేశాడు ధోనీ. యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, చెన్నైకి కొత్త కెప్టెన్‌గా టీమ్‌ని నడిపిస్తాడు..
MS Dhoni : స్నేహితుడి కోసం ధోనీ చేసిన ఓ చిన్న పని.. అతని కెరీర్‌నే మార్చేసింది..
ఇప్పటికే ముంబై టీమ్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. దీంతో ఐపీఎల్ 2024లో దాదాపు అందరూ కుర్రాళ్లే, ఫ్రాంఛైజీలను నడిపించబోతున్నారు. పంజాబ్ టీమ్‌కి శిఖర్ ధావన్, బెంగళూరు టీమ్‌కి డుప్లిస్ మాత్రమే చాలా అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు. మిగిలిన ప్లేయర్లంతా 30-31, ఆలోపు వయసున్న వాళ్లే.
55 లీగ్ మ్యాచులకు కెప్టెన్సీ చేసిన శ్రేయాస్ అయ్యర్, ఐపిఎల్ 2024లో అత్యధిక అనుభవం ఉన్న కెప్టెన్. దీంతో కుర్రాళ్ల కెప్టెన్సీలో సీనియర్లు ఆడబోతున్నారన్నమాట. దాదాపు 2 నెలల పాటు సాగే ఐపిఎల్‌కి ఎన్నికల కారణంగా అంతరాయం కలగనుంది. ఎన్నికల సమయంలో మ్యాచులు ఇక్కడ పెట్టాలా? లేక విదేశాల్లో పెట్టాల్నా అని బీసీసీఐ ఇంకా ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం రావచ్చు.