Allu Arjun : అల్లు అర్జున్‌తో సినిమా కోసం రూ.60 కోట్లు డిమాండ్ చేస్తున్న అట్లీ..

Allu Arjun :‘రాజా రాణి’, ‘మెర్సిల్’, ‘బిగిల్’ వంటి తమిళ్ సినిమాలతో తెలుగులోనూ హిట్లు కొట్టిన డైరెక్టర్ అట్లీ, గత ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీ చేసి… రూ.1200 కోట్లు కొల్లగొట్టాడు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది ‘జవాన్’.ఈ మూవీ తర్వాత తెలుగు హీరో అల్లు అర్జున్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అట్లీ..

Razakar Movie Review : జనం మరిచిన హైదరాబాద్ చరిత్ర..

అల్లు వారి సొంత బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌లో అల్లు అర్జున్ – అట్లీ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీకి రూ.150-200 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్‌తో సినిమా కోసం అట్లీ, రూ.60 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. తీసిందే ఐదు సినిమాలు. అందులోనూ పాత సినిమాల కథలను అటు ఇటు తిప్పే అట్లీకి రూ.60 కోట్లు ఇచ్చే కంటే, రూ.5 కోట్లతో హరీశ్ శంకర్‌తో సినిమా చేయడం బెటర్ అంటున్నారు అభిమానులు..

ప్రస్తుతం అట్లీ, ఇప్పటిదాకా ఏ మూవీ అనౌన్స్ చేయలేదు. విజయ్ చేసే ఆఖరి సినిమాకి అట్లీ దర్శకత్వం చేస్తాడని ప్రచారం జరిగినా అది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న అల్లు అర్జున్, ఆ తర్వాత అట్లీతో సినిమా మొదలు పెడతాడు. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. వచ్చే మూడేళ్లలో ఓ హాలీవుడ్ చేస్తానని ప్రకటించాడు దర్శకుడు అట్లీ..

Sai Dharam Tej New Name : పేరు మార్చుకుని, తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ పెట్టి..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post