Salaar : టికెట్ల రేట్లు భారీగా తగ్గించడంతో ఆంధ్ర రాష్ట్రంలో సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించడమే కష్టంగా మారింది. నాని బిగ్గెస్ట్ హిట్ ‘దసరా’ మూవీతో పాటు టాలీవుడ్ వండర్ ‘RRR’ మూవీకి కూడా ఆంధ్రా ఏరియాలో కొన్ని నష్టాలు తప్పలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లు రాబట్టింది. అయితే ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలు వచ్చాయి..
Pushpa 2 Exclusive Update : రెస్ట్ లేదా పుష్ప..
నైజాంలో భారీ లాభాలు తెచ్చిపెట్టిన ప్రభాస్ ‘సలార్’, ఓవర్‌సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. హిందీలో షారుక్ ‘డంకి’ మూవీతో పోటీగా రిలీజ్ అయినా రూ.150 కోట్లు రాబట్టగలిగింది. దీంతో సలార్ నిర్మాత విజయ్ కిర్గందుర్, ఆంధ్రా ఏరియాలో నష్టాలు ఎదుర్కొన్న డిస్టిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేశాడట..
సీడెడ్ ఏరియాలో సలార్ మూవీని రూ.27 కోట్లకు అమ్మగా, ఆంధ్రాలో ఈ మూవీ రైట్స్‌ని రూ.80 కోట్లకు అమ్మాయి. ఇందులో రూ.72 కోట్ల వరకూ తిరిగి రాబట్టగా రూ.8 కోట్ల వరకూ నష్టాలు మిగిలాయి. ఈ డబ్బును సంబంధిత డిస్టిబ్యూటర్లకు తిరిగి చెల్లించాడట నిర్మాత విజయ్. ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలకు కూడా డిస్టిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే అప్పుడు ఏ నిర్మాత కూడా చిల్లి గవ్వ వెనక్కి ఇవ్వాలని ప్రయత్నించలేదు.
SSMB 29 : రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుందా? లేదా..