Chiranjeevi : రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అభిమానులకు మనస్ఫూర్తిగా నచ్చే ఒక్క సినిమా చేయలేకపోయారు. ‘ఖైదీ నెం.150’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడినా ఫ్యాన్స్ అందరినీ సంతృప్తిపరచలేకపోయాయి. ‘భోళా శంకర్’ రిజల్ట్‌తో ప్రస్తుతం ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. ‘భోళా శంకర్’కి ముందు సుజిత్, హరిశ్ శంకర్ వంటి డైరెక్టర్లతో రీమేక్ సినిమాలు చేస్తానని మాటిచ్చాడు చిరంజీవి. అయితే మెహర్ రమేశ్ తీసిన కల్ట్ సినిమా దెబ్బకు ఆ రీమేకులన్నీ సైడ్ అయిపోయాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఓ పాన్ ఇండియా మూవీలో ఆఫర్ వచ్చిందని, రెమ్యూనరేషన్‌గా ఏకంగా రూ.100 కోట్లు చెల్లిస్తామని నిర్మాతలు చెప్పినట్టు టాక్. అయితే సినిమా కథ పెద్దగా నచ్చకపోవడంతో చిరు దాన్ని రిజెక్ట్ చేశాడట.. మలయాళ మెగాస్టార్ మమ్మూట్టీ వరుసగా విభిన్నమైన కాన్సెప్ట్‌లు ఎంచుకుంటూ, బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ మాత్రం రొట్ట మాస్ సినిమాలే చేస్తున్నాడనే విమర్శ ఉంది. చిరంజీవి ఆ మార్క్ తుడిచేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాడట.
చిరంజీవి, ప్రతీ ఏడాది పాత హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడు! అతనా నాకు చెప్పేది..