Vishwak Sen : ఇక ప్రయోగాలు చేయను, బాక్సాఫీస్‌ని తగలబెడతా..

Vishwak Sen : కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్‌కి తేడా రెండు అక్షరాలే! హీరో విశ్వక్ సేన్ మాటలు వింటే కొంతమందికి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని అనిపిస్తూ ఉంటుంది.

Jr NTR : దేవర వచ్చేది అప్పుడే! బన్నీని ఇబ్బంది పెట్టకుండా సైడ్ ఇచ్చిన తారక్..

తరుణ్ భాస్కర్ ‘ఈనగరానికి ఏమైంది’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని, ‘ఫలక్‌నుమా దాస్’ మూవీతో డైరెక్టర్‌గా మారాడు విశ్వక్ సేన్. లాస్ట్ ఇయర్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు ‘గామి’ సినిమాతో వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాల్సిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాని సైడ్ చేసిన విశ్వక్ సేన్, ‘గామి’ కచ్ఛితంగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నాడు..

‘గత రెండేళ్లలో నేను చాలా ప్రయోగాలు చేశాను. ఇక ప్రయోగాలు చాలని అనుకుంటున్నా. ఇకపై వచ్చే రెండేళ్లు తగలబడిపోయే సినిమాలు తీస్తాను.. ఎంత తగలబడతాయో చూస్తాను..’ అంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటించాడు విశ్వక్ సేన్… ‘గామి’ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. దీని కోసం చాలా హోం వర్క్ చేశానని, వారణాసిలో షూటింగ్ చేస్తుంటే నిజమైన అఘోర అనుకుని చాలామంది పైసలు కూడా వేశారని కామెంట్ చేశాడు విశ్వక్ సేన్.. మరి ‘గామి’ బాక్సాఫీస్‌ని ఎంతగా ఫైర్ చేస్తుందో చూడాలంటే మార్చి 8వరకూ ఆగాల్సిందే.

Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post