Curd Benefits : పెరుగుతో ఆరోగ్యం పెరుగు..

Curd Benefits : పెరుగు ఎల్లప్పుడూ మన ఆహారంలో అంతర్భాగంగా ఉంది. మనం అనేక విధాలుగా పెరుగును ఆహారంలో చేర్చుకుంటాం. కొందరికి మొత్తం అన్నం తిన్నాక ఒక్క ముద్ద పెరుగన్నం తిననిదే తృప్తిగా అనిపించదు. మరికొందరికి పెరుగు అనేది అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసమే ఇది..

Drinking Water : నీళ్లు తాగడం ఒక ఆర్ట్..

* కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని
ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
* కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి.
దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి.
దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

* కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి.
దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది.
మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
* కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి.
దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి,
ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

* ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
* పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి.
ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

Harish Shankar Fire on Websites : సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్..

* పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే
శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.
ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
* పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి.
దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది.
ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

* పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత
విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది.
వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
* పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో
ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి.
ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది.
దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే తగ్గుతాయి.

జైలు శిక్ష అనుభవిస్తూ పీజీలో గోల్డ్ మెడల్.. నీ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post