Yatra 2 Review : పక్కా పొలిటికల్ ఎజెండా… జగన్ ఫ్యాన్స్‌కి మాత్రమే..

Yatra 2 Review : నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర 2’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ విడుదలైంది. ఈ మూవీ రూ.14 కోట్లు వసూలు చేసి, మంచి సక్సెస్ సాధించింది. ఐదేళ్ల తర్వాత కొడుకు జగన్ బయోపిక్‌ని థియేటర్లోకి తీసుకొచ్చాడు దర్శకుడు మాహీ వీ. రాఘవ్..

Guntur Kaaram OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మహేష్ గుంటూర్ కారం..

టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగానే ఈ మొత్తం జగన్ చుట్టునే తిరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎపిసోడ్స్‌తో సినిమా మొదలై, ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు, అక్రమ ఆస్తుల కేసు, జైలు శిక్ష వంటివి చూపించాడు డైరెక్టర్… సినిమా వివాదాస్పదం కాకుండా ఉండేలా ఎక్కడా ప్రతిపక్ష నాయకులను విలన్స్‌గా చూపించకుండా చాలా జాగ్రత్తగా కథ, కథనాలు రాసుకున్నాడు మాహీ వీ. రాఘవ్..

రాజశేఖర్ రెడ్డిగా మమ్మూట్టీ జీవించేయగా జగన్ పాత్రలో జీవా నటన కూడా మెప్పిస్తుంది. అయితే జగన్ బయోపిక్‌లా కాకుండా ఓ సాధారణ పొలిటికల్ డ్రామాగా చూస్తే, ‘యాత్ర 2’ చాలామందికి నచ్చుతుంది. అయితే జీవా చేసిన రోల్‌లో జగన్‌ని ఊహించుకోవడం చాలామందికి ఓవర్‌గా అనిపించొచ్చు. భజన చేస్తున్నట్టుగానే తలపించవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ చేసింది కూడా అదే..

Srimanthudu Controversy : మహేష్‌ ని కేసు నుంచి తప్పించిన నమ్రత..

‘సంజూ’ సినిమాలో సంజయ్ దత్‌ని చాలా మంచోడుగా చూపించేందుకు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఎంత కష్టపడ్డాడో చూశాం. అయితే సంజయ్ దత్ జీవితంలో చాలా విషయాలు నేటి తరానికి తెలియవు. అయితే జగన్ విషయంలో అలా కాదు మరి! మొత్తానికి జగన్‌ని గొప్ప నాయకుడిగా మాహీ చేసిన ప్రయత్నం, వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు బాగా నచ్చుతుంది.. మిగిలిన వారికి ఇది జగన్ భజనే!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా పొలిటికల్ ఏజెండాతో సినిమాని తీసుకురావడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post