Prabhas Kalki 2898AD : ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. 800 ఏళ్ల తర్వాత జరిగిన కథకీ, 6 వేల ఏళ్ల క్రితం జరిగిన కథకీ లింకు పెట్టి ఓ సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ మూవీ కోసం దాదాపు రూ.700 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నారు.. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ‘కల్కీ’ మూవీ.
Fighter Director : విమానం ఎక్కని లో-క్లాస్ జనాలకు నా సినిమా వాల్యూ ఎలా తెలుస్తుంది..!?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీలో దీపికా పదుకొనే, దీశా పఠానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ‘అశ్వర్థామ’ క్యారెక్టర్‌లో, కమల్ హాసన్ ‘కాలి’ పాత్రలో నటిస్తుననారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్ ఓ కీ రోల్ చేయబోతున్నాడు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, దర్శకులు ఎస్.ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ‘కల్కి’ మూవీలో నటిస్తున్నారు.
ఇంతమంది స్టార్ తారాగణంతో వచ్చిన ఏ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ అయింది లేదు. కథా బలం లేనప్పుడే అభిమానులను థియేటర్లకు రప్పించడానికి స్టార్లను చేరుస్తూ ఉంటారనే అపవాదు కూడా ఉంది. మరి నాగ్ అశ్విన్, వందల కోట్ల బడ్జెట్‌తో పెద్ద రిస్కే చేస్తున్నట్టుగా ఉంది.. ‘కల్కి’ రిజల్ట్ కాస్త తేడా కొట్టినా ప్రభాస్ ఇమేజ్‌కి పెద్దగా వచ్చిన ముప్పు ఏమీ లేదు, కానీ తన మామ అశ్వినీదత్ నిర్మాత కావడంతో ఏదైనా తేడా జరిగితే, వైజయంతీ మూవీస్ మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు..
Natural Star Nani : రేంజ్ పెంచుకుంటున్న నేచురల్ స్టార్..