Kismat Review : కిస్మత్ ఏం మారలే..

Kismat Review : శ్రీనివాస్ అవసరాల, నరేష్ అగస్త్ర్య, అభినవ్ గోమటం ముఖ్య పాత్రల్లో నటించిన ‘కిస్మత్’ మూవీ, ఫిబ్రవరి 2న విడుదలైంది. రియా సుమన్ హీరోయిన్‌గా నటించిన ‘కిస్మత్’ మూవీలో రచ్చ రవి, ఛమ్మక్ చంద్ర వంటి నటీనటులు నటించారు.. ఇంతకీ ‘కిస్మత్’ వీళ్ల కిస్మత్ మార్చిందా…

Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, జీవితంలో ఏదో పెద్దగా సాధించాలని కలలు కంటూ ఉంటారు. అయితే బ్యాడ్ లక్ కారణంగా ఏదీ కలిసి రాలేదు. ఏదోరోజు కిస్మత్ కలిసి వచ్చి, రాత మారుతుందని ఆశపడుతూ ఉంటారు. ఓ కొత్త నగరానికి వచ్చిన వారి జీవితాలు ఎలా మారాయి? వాళ్లు అనుకున్నట్టుగా సంచుల కొద్దీ డబ్బు సంపాదించారా? ఇదే ‘కిస్మత్’ మూవీ కథ..

మార్క్ కె రాబిన్ ఈ కిస్మత్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. శ్రీనాథ్ బాదినేని ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ‘కిస్మత్’లో పేరుకి కాస్త ఫేమ్ ఉన్న నటీనటులు ఉన్నా, కథా, కథనంలో ఎలాంటి వైవిధ్యం కనిపించదు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్న దర్శకుడు, అటు కామెడీ చేయలేక, ఇటు థ్రిల్లర్‌లా మార్చలేకపోయాడు..

అభినవ్ గోమటం సింగిల్ లైన్ పంచులు అక్కడక్కడా పేలుతాయి. అవసరాల శ్రీనివాస్‌ లాంటి నటుడిని సరిగ్గా వాడుకోలేకపోయారు. టైమ్ పాస్ కోసం సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్లినవారికి బోర్ కొట్టించేశారు. మొత్తానికి ‘కిస్మత్’ బాగోలేకపోతేనే, ‘కిస్మత్’ చూడడానికి థియేటర్ వెళ్లినట్టుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

Ambajipeta Marriage Band Review : బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుహాస్..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post