Ambajipeta Marriage Band Review : యూట్యూబ్ నుంచి చాలామంది వెండితెర మీదకి వచ్చారు. రాజ్ తరుణ్, చాందిని ఇలా వచ్చినవాళ్లే. అయితే వీళ్లకు భిన్నంగా ప్రతీ సినిమాకి ఓ వైవిధ్యం చూపిస్తూ, తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సుహాస్. ‘కలర్ ఫోటో’, ‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ తర్వాత సుహాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న ఐదు సినిమాల్లో ‘అంబాజీపేట’ మూవీకి మాత్రమే హైప్ వచ్చింది.
Natural Star Nani : రేంజ్ పెంచుకుంటున్న నేచురల్ స్టార్..
ట్రైలర్‌లో చూపించినట్టుగానే అంబాజీపేట అనే గ్రామంలో సెలూన్ నిర్వహించే హీరో, అదే ఊరి జమీందారు కూతుర్ని ప్రేమిస్తాడు. అదే ఊరిలో స్కూల్ టీచర్‌గా పనిచేసే అతని అక్క, హీరోయిన్ అన్నకు ఎఫైర్ ఉందని పుకారు లేస్తుంది.. అక్క ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ్ముడు ఏం చేశాడు? కులాల అడ్డుగోడలు దాటి, తన ప్రేమను గెలిపించుకోగలిగాడా? అనేదే సింపుల్‌గా ఈ మూవీ కథ.. రిప్లబిక్ దేశంగా ప్రకటించుకుని 70 ఏళ్లు దాటుతున్నా ఇంకా గ్రామాల్లో నాటుకుపోయిన కుల వ్యవస్థ, అంటరాని తనాన్ని మరోసారి చూపిస్తుంది అంబాజీపేట మ్యారేజి బ్యాండు.
ట్రైలర్‌లో చూపించినట్టుగా ఈ మూవీకి మెయిన్ హైలైట్ సుహాస్. నటుడిగా తన రేంజ్ పెంచేసుకుని, తనకంటూ ఓ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సుహాస్. అలాగే శరణ్య ప్రదీప్ యాక్టింగ్ కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. తెలియకుండానే టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన శరణ్య, ఈ మూవీ తర్వాత మరింత బిజీ అయిపోవచ్చు..
హీరోయిన్ శివానీ నాగరం క్యూట్‌గా ఉండడమే కాకుండా అంతే క్యూట్‌గా పర్ఫామెన్స్ ఇచ్చింది. కోలీవుడ్‌లో వర్కవుట్ అయినంతగా తెలుగులో ఇలాంటి కులవ్యవస్థ మీద వచ్చిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కావు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఇలాంటి కథతోనే తెరకెక్కి, డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’కి సుహాస్, ఇతర నటీనటుల యాక్టింగ్ ప్లస్. కథ బాగున్నా, కథనాన్ని మరింత టైట్ చేసి ఉండొచ్చు..
యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..
శేఖర్ చంద్ర మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాకి హైలైట్. డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని, కథను బాగానే రాసుకున్నా, దాన్ని తెర మీద చూపించడంలో కేవలం పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకున్నాడు. మొత్తానికి ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీని నటీనటుల పర్ఫామెన్స్ కోసమైనా ఓసారి చూసేయొచ్చు.