Free Bus Effect : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీ బస్సు స్కీమ్ వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ కారణంగా ఆటోలకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. తమ జీవనోపాధి మొత్తం పోయిందని ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ర్యాపిడీ, ఓలా వంటి ట్రావెల్ యాప్స్ పరిస్థితి కూడా ఇంతే!
TSRTC free bus Effect : ఫ్రీ బస్సు తెచ్చిన తంటా.. 3 రోజులుగా తిండి తిప్పలు మానేసి..
వీళ్ల సంగతి పక్కనబెడితే ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆఫీసులకు వెళ్లే మహిళలు, పురుషులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళల సంగతి పక్కనబెడితే పురుషులకు నిలబడడానికి కూడా చోటు ఉండడం లేదు. దీంతో నగరంలో పురుషులకు మాత్రమే స్పెషల్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ బస్సు సర్వీసుల వల్ల ఆక్యుపెన్సీ పెరగడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. జీరో టికెట్లు జీరో కావడంతో ఈ సర్వీసుల మీద మంచి లాభాలు సంపాదించవచ్చని భావిస్తోంది ఆర్టీసీ..
ఇప్పటికే ప్రయోగాత్మకంగా నగరంలో పురుషులకు మాత్రమే బస్సు సర్వీసులు మొదలయ్యాయి. ఇవి సక్సెస్ అయితే నగరంలోని అన్ని రూట్లలోనే మెన్స్ స్పెషల్ బస్సులు రాబోతున్నాయి. ఇంతకుముందు పురుషుల రద్దీ కారణంగా ఆడవాళ్లు ఇబ్బంది పడకుండా ‘మహిళలకు మాత్రమే’ స్పెషల్ బస్సులు నడిచేవి. ఇప్పుడు ఆ ప్లేస్లో ‘పురుషులకు మాత్రమే’ బస్సులు రాబోతున్నాయి. జంబలకిడి పంబ అంటే ఇదేనేమో!
Free Bus Travel Scheme : 50 రోజులు, 12 కోట్ల మంది మహిళలు, ఫ్రీ బస్సు పథకం వల్ల..